Iphone 12: రూ. 60 వేల ఐఫోన్‌ని రూ. రూ. 34 వేలకే సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగంటే..
ఐఫోన్ లవర్స్‌కి ఇది నిజంగానే పండగలాంటి వార్త అని చెప్పాలి. ఐఫోన్ 12ను మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకు సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. ఏకంగా సుమారు రూ. 15 వేల తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 12 అసలు ధర ప్రస్తుతం ఈకామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో..
ఐఫోన్ లవర్స్‌కి ఇది నిజంగానే పండగలాంటి వార్త అని చెప్పాలి. ఐఫోన్ 12ను మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకు సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. ఏకంగా సుమారు రూ. 15 వేల తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 12 అసలు ధర ప్రస్తుతం ఈకామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 48,900గా ఉంది. అయితే ఈ ఫోన్‌ను రూ. 33,999కి సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. పాత ఐఫోన్ ఎక్స్చేంజ్‌తో పాటు, క్యాష్ బ్యాక్‌లతో ఐఫోన్ 12ని ఈ ధరకు సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ 12 ఒరిజినల్ ధర రూ. 59,900 కాగా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లో భాగంగా రూ. 48,999కి లిస్ట్ చేసింది. అయితే ఫెడరల్ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి రూ. 1500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది. ఇక పాత ఐఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా రూ. 15,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. వీటన్నింటినీ కలుపితే ఈ ఫోన్‌ను చివరిగా రూ. 33,999కే సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ 12 ఫీచర్లు..
ఐఫోన్ 12 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.1 ఇంచెస్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. ఏ14 బయోనిక్ చిప్‌సెట్‌ను ఇందులో అందించారు. కెమెరా విషయానికొస్తే 12 మెగాపిక్సెల్ ట్రూడెప్త్ కెమెరాను అందించారు. ఈ కెమరాతో 4కే డాల్బీ విజన్ హెచ్‌డీఆర్ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఐఓస్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. డాల్బీ ఆటమ్స్ వంటి సౌండ్ సిస్టమ్‌ను అందించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..