Jio 5G: రిలయన్స్ జియో మరో మైలురాయి.. 5జీ నెట్‌వర్క్‌లో రికార్డ్ సృష్టించిన తొలి రాష్ట్రం ఇదే
దేశంలో టెక్నాలజీ పెరిగిపోతోంది. దేశంలో ప్రస్తుతం 4జీ టెక్నాల నుంచి 5జీ టెక్నాలజీ రాబోతోంది. దీంతో ఇటీవల దేశంలో ప్రముఖ టెలికాం కంపెనీలు..
దేశంలో టెక్నాలజీ పెరిగిపోతోంది. దేశంలో ప్రస్తుతం 4జీ టెక్నాల నుంచి 5జీ టెక్నాలజీ రాబోతోంది. దీంతో ఇటీవల దేశంలో ప్రముఖ టెలికాం కంపెనీలు 5జీ టెక్నాలజీని తీసుకువచ్చాయి. ఇప్పటికే ట్రయల్స్ పూర్తి చేసిన రిలయన్స్ జియో,ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు.. దేశంలోని పలు రాష్ట్రాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. తర్వాత దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఇక లయన్స్ జియో గత నెలలో జియో ట్రూ 5జీ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. 5జీ సేవలు అందించడంలో జియో సరికొత్త రికార్డును సృష్టించింది. దేశ రాజధాని అంతటా 5జీ సేవలు అందిస్తున్న తొలి టెలికాం కంపెనీగా రిలయన్స్ జియో రికార్డు సృష్టించింది. ఈ జియో ట్రూ 5జీ సేవలు ఢిల్లీ-ఎన్‌సీఆర్ అంతటా లభిస్తున్నాయని కంపెనీ వెల్లడించింది.
ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్‌తో పాటు ఇతర ప్రధాన ప్రాంతాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులో వచ్చినట్లు జియో తెలిపింది. ఇప్పుడు భారతదేశంలో జియో 5జీ సేవలను పూర్తిగా పొందిన రాష్ట్రంగా గుజరాత్ అవతరించింది. ఈ సందర్భంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. మా బలమైన ట్రూ 5జీ నెట్‌వర్క్‌ను అనుసంధానించిన 100 శాతం జిల్లా హెడ్‌క్వార్ట్స్ కలిగివున్న మొదటి రాష్ట్రంగా ఇప్పుడు గుజరాత్ అవతరించడం గర్వకారణంగా ఉందని అన్నారు. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా నవంబర్ 25 నుంచి జియో ట్రూ 5జీ సేవలను 33 జిల్లా కేంద్రాల్లో అందిస్తున్నట్లు తెలిపారు.1జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా పొందవచ్చని రిలయన్స్ జియో ఒక ప్రకటనలో తెలిపింది.
100 శాతం జిల్లా ప్రధాన కార్యాలయాలు 5జీ నెట్‌వర్క్‌కు అనుసంధానమైన మొదటి రాష్ట్రంగా గుజరాత్ నిలవడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికి మెరుగైన నెట్ వర్క్ అందించడమే జియో ముఖ్య ఉద్దేశమన్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన రిలయన్స్ జియో.. 1.3 బిలియన్ల యూజర్లతోడిజిటల్ రంగంలో గ్లోబల్ లీడర్‌గా నిలిపిందని అన్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి