IQoo 11 5G: ఐకూ నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ ఐకూ కొత్త ఫోన్ లాంచ్ చేస్తోంది. ఐకూ 11 పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను డిసెంబర్ 2వ తేదీన మలేషియాలో లాంచ్ చేయనున్నారు. ఆ తర్వాత భారత్‌లో విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో తీసుకురానున్నట్లు సమాచారం...
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ ఐకూ కొత్త ఫోన్ లాంచ్ చేస్తోంది. ఐకూ 11 పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను డిసెంబర్ 2వ తేదీన మలేషియాలో లాంచ్ చేయనున్నారు. ఆ తర్వాత భారత్‌లో విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో తీసుకురానున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను అందించారు. ఇక భారత్‌లో ఈ ఫోన్‌ను జనవరిలో విడుదల చేయనున్నారు.
ఈ స్మార్ట్ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్ +256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో తీసుకురానున్నారు. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్ ఈ6 అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 1440p రిజల్యూషన్,144Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 13 ఆరిజిన్ ఓఎస్ 3.0 స్కిన్‌ను ఇవ్వనున్నారు. ఇక కెమెరాకు కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
కెమెరా విషయానికొస్తే ఇందులో ట్రిపుల్ కెమెరాను అందించారు. రెయిర్ కెమెరా మొత్తం 3 కెమెరాలతో రూపొందించారు. వీటిలో ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్ కాగా, ఇతర రెండు కెమెరాలను 13, 12 మెగా పిక్సెల్స్ కెమెరాను ఇచ్చారు. ఇక సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే.. 120వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో, 5,000mAh బ్యాటరీని అందించారు. ధర విషయంపై ఇంకా ఎలాంటి కంపెనీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. లాంచింగ్ రోజే ధర వివరాలు ప్రకటించనున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..