HP Employees: ఉద్యోగులకు షాకివ్వనున్న హెచ్‌పీ కంపెనీ.. అదేంటంటే..!
కొన్ని కంపెనీల్లో ఉద్యోగులకు ఎదురుదెబ్బ తగులుతోంది. బడా కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ వస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరం చివరి..
కొన్ని కంపెనీల్లో ఉద్యోగులకు ఎదురుదెబ్బ తగులుతోంది. బడా కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ వస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 6,000 ఉద్యోగాలను లేదా గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 12% శాతం మందిని తగ్గించాలని భావిస్తున్నట్లు హెచ్‌పీ కంపెనీ మంగళవారం తెలిపింది. ఈ సమయంలో వ్యక్తిగత కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు షాపర్లు బడ్జెట్‌లను కఠినతరం చేయడంతో ఉద్యోగుల సంఖ్య తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే కంప్యూటర్ల తయారీలో మొదటి త్రైమాసికంలో ఊహించనిదానికంటే తక్కువ లాభాలను అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎదుర్కొన్న సవాళ్లు.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగే అవకాశాలున్నాయని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మేరీ మైయర్స్ పోస్ట్-ఎర్నింగ్స్ కాల్ తెలిపారు.
దాదాపు 50,000 మంది ఉద్యోగులున్న కంపెనీ.. 4 వేల నుంచి 6 వేల మంది ఉద్యోగులను తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. 2019లో 7,000 నుండి 9,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు హెచ్‌పీ ప్రకటించింది. కరోనా మహమ్మారి సమయంలో హెచ్‌పీ, డెల్ కంపెనీల కంప్యూటర్ల అమ్మకాలు సైతం పూర్తిగా తగ్గిపోయాయి. అంతకు ముందు సోమవారం డెల్ మూడవ త్రైమాసిక ఆదాయంలో 6 శాతం పతనాన్ని నివేదించింది. పెరుగుతున్న వడ్డీ రేట్లతో సహా కొనసాగుతున్న స్థూల ఆర్థిక అంశాలు వచ్చే ఏడాది వినియోగదారులపై ప్రభావం చూపుతాయని డెల్ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ టామ్ స్వీట్ అన్నారు. హెచ్‌పీ కూడా నాలుగో త్రైమాసిక ఆదాయంలో 11 శాతం పడిపోయి 14.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.