Ozone Layer Hole: మనిషి హంగులు, ఆర్భాటాలతో భూమికి పొంచివున్న ప్రమాదం.. ఓజోన్ పొరకు భారీ రంధ్రాలు..

పొరకు రంధ్రాలు ఏర్పడడానికి  క్లోరోఫ్లోరో కార్బన్స్ కారణమని నాసా చెబుతోంది. ప్రధాన కారణం ఏసీలు, ఫ్రిజ్ లు వాడకమని.. వీటి నుంచి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్స్  అత్యంత ప్రమాదకరమని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 

Ozone Layer Hole: మనిషి హంగులు, ఆర్భాటాలతో భూమికి పొంచివున్న ప్రమాదం.. ఓజోన్ పొరకు భారీ రంధ్రాలు..
Ozone Layer Hole
Follow us

|

Updated on: Jul 07, 2022 | 12:57 PM

Ozone Layer Hole: మనిషి నాగరికత, ఆధునిక విజ్ఞానం, టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి అంటూ.. ప్రకృతికి దూరంగా.. కృతిమాలకు దగ్గరగా జీవించడం మొదలు పెట్టాడు. తన వేలుతో తన కన్ను పొడుచుకున్న చందంగా.. మనిషి ఆధునికత పేరుతో చేపడుతున్న పనులు.. ఉపయోగిస్తున్న ఎలక్రికల్ వస్తువులు తదితరాలు అతిప్రమాదానికి కారణమౌవుతున్నాయి. తాజాగా పర్యావరణవేత్త పరిశోధనలో ఆందోళనకరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

శాస్త్రవేత్తలు ఓజోన్ వాయువు పొరలో పెద్ద రంధ్రం కనుగొన్నారు. ఈ ఓజోన్ పొర భూమిని చుట్టుముట్టి ఉంటుంది. సూర్యుని నుంచి వెలువడే హానికరమైన అతినీలలోహిత కిరణాల నుండి కాపాడుతుంది. AIP అడ్వాన్సెస్‌లో ప్రచురించబడిన కథనం ప్రకారం మానవుడిని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోన్ లేయర్ కు భారీ రంధ్రాన్ని సైంటిస్టులు గుర్తించారు. గతంలో అంటార్కిటికా ప్రాంతంలో గుర్తించిన దాని కన్నా ఇది 7 రెట్లు పెద్దదిని కెనడాలోని వాటర్లు విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త క్వింగ్-బిన్ లూ చెప్పారు. కొత్తగా కనుగొనబడిన ఈ ఓజోన్ రంధ్రం ఉష్ణమండలంపై గత 30 సంవత్సరాలకు పైగా ఉందని తెలిపారు.  ఈ రంధ్రం దిగువ స్ట్రాటో ఆవరణంలో ఏర్పడినట్లు పేర్కొన్నారు.

ఓజోన్ పొర..  మూడు ఆక్సిజన్ అణువుల సమ్మేళనంగా (ఓ3). ఇది భూమి ఎగువ వాతావరణంలో ఒక పొరలా ఉండీ.. సూర్యుడి నుంచి వచ్చే ఆల్ట్రా వయోలెట్ కిరణాల నుంచి భూమిని, భూమిపై జీవరాశిని రక్షిస్తోంది. అయితే పొరకు రంధ్రాలు ఏర్పడడానికి  క్లోరోఫ్లోరో కార్బన్స్  కారణమని నాసా చెబుతోంది. ఇలా రంధ్రాలు పడిన ప్రాంతాల్లో ఓజోన్ రక్షణ ఉండదు.. గత కొన్ని ఏళ్లుగా ఓజోన్ క్షీణతకు, ఓజోన్ రంధ్రం ఏర్పడుతుందని.. దీనికి ప్రధాన కారణం కృత్రిమ రసాయనాలని.. ముఖ్యంగా హేలోకార్బన్ రిఫ్రిజెరంట్లు, ద్రావకాలు, చాలకాలు, క్లోరోఫ్లూరోకార్బన్‌లు, హేలోన్‌లు HCFC లు. ఈ హానికారక పదార్ధాలతో ఓజోన్ లేయర్ గడిచిన కొన్ని దశాబ్ధాలుగా పలుచబడిపోతుందని సైంటిస్టులు ఆందోళలన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఓజోన్ క్షీణతకు ప్రధాన కారణం ఏసీలు, ఫ్రిజ్ లు వినియోగంఅని.. వీటి నుంచి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్స్  అత్యంత ప్రమాదకరమని చెబుతున్నారు.  వీటి నుంచి వెలువడే.. క్లోరోఫ్లోరో కార్బన్ లతో ఓజోన్ గ్యాస్ రసాయనిక చర్య వల్ల ఆక్సిజన్, క్లోరిన్ వాయువులు ఏర్పడిన ప్రాంతంలో ఓ3 వాయవు  ఉండదు. దీంతో సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు భూమి మీద నేరుగా ప్రసరిస్తాయి. అప్పుడు రేడియేషన్ భారీగా పెరుగుతుంది. భూమి మీద జీవరాశులపై, మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కంటి చూపు మందగిస్తుంది. చర్మ క్యాన్సర్లకు కారణం అవుతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. కనుక ఇప్పటికైనా మనిషి మేల్కొని.. పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోకపోతే.. రానున్న తరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనవలసి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..