AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NASA: కొత్త అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో ముందడుగు.. ఆ గ్రహాన్ని టార్గెట్ చేసిన నాసా..

భూమి చుట్టూ తిరిగే అంతరిక్ష కేంద్రం 2030లో ముగియనుంది. ఆ అంతరిక్ష కేంద్రాన్ని భూమికి దూరంగా మరో గ్రహం దగ్గర నిర్మించాలని నాసా యోచిస్తోంది. ఇది అంతరిక్ష ప్రయాణానికి కూడా మేలు చేస్తుంది.

NASA: కొత్త అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో ముందడుగు.. ఆ గ్రహాన్ని టార్గెట్ చేసిన నాసా..
Nasa
Venkata Chari
|

Updated on: Jul 06, 2022 | 8:35 PM

Share

భూమి చుట్టూ తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) 2030 సంవత్సరం నాటికి నిరుపయోగంగా మారనుంది. అయితే, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కొత్త గ్రహం చుట్టూ తిరిగే అంతరిక్ష కేంద్రాన్ని ప్లాన్ చేసింది. దాని పరిశోధన కోసం మైక్రోవేవ్ సైజు ఉపగ్రహాన్ని కూడా అంతరిక్షంలోకి పంపింది. ఈ ఉపగ్రహం భూమి కక్ష్య వెలుపలికి కూడా వెళ్లింది. స్పేస్ స్టేషన్‌ను ఎక్కడ, ఎలా నిర్మిస్తారనేది త్వరలో ప్రకటించనున్నట్లు నాసా పేర్కొంది. ఈ స్పేస్ స్టేషన్ ప్రయోజనం ఏమిటంటే మానవులు చంద్రునిపైకి సులభంగా ప్రయాణించగలుగుతారని అంటున్నారు. ఇది మాత్రమే కాదు, ఒక వ్యక్తి అంగారక గ్రహానికి లేదా మరేదైనా ఇతర గ్రహానికి ప్రయాణించడానికి ఈ అంతరిక్ష కేంద్రంలో విశ్రాంతి తీసుకోగలుగుతారంట. అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడానికి ముందు నాసా వదిలిపెట్టిన ఉపగ్రహం పేరు క్యాప్‌స్టోన్‌గా పేర్కొంది.

కొన్ని సంవత్సరాలలో, నాసా కొత్త అంతరిక్ష కేంద్రం అంతరిక్షంలో నిర్మించనుంది. ఇది భూమి కక్ష్య చుట్టూ తిరగదు. బదులుగా, అది చంద్రుని చుట్టూ తిరుగుతుంది. దీనిని చంద్ర ద్వారం అని పిలుస్తారు. భూమి తర్వాత అంతరిక్ష కేంద్రం సహజ గ్రహం చుట్టూ తిరగడం ఇది రెండోసారి. ఇది తిరిగే కక్ష్యను నియర్-రెక్ట్‌లీనియర్ హలో ఆర్బిట్ (NRHO) అని అంటారు. క్యాప్‌స్టోన్ ఉపగ్రహం చంద్రుడిపైకి చేరేందుకు మరో నాలుగు నెలల సమయం పడుతుంది. దీని తరువాత, ఇది దాదాపు ఆరు నెలల పాటు చంద్రుని చుట్టూ తిరుగుతుంది. డేటాను సేకరిస్తుంది. తద్వారా లూనార్ గేట్‌వేకి ఇది సరైన కక్ష్య కాదా అని NASA కనిపెట్టగలదు. క్యాప్‌స్టోన్ చంద్రుని ఉత్తర ధ్రువం నుంచి 1600 కి.మీ., దక్షిణ ధృవం నుంచి 70 వేల కి.మీ కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ఒక రౌండ్ తిరగడానికి గరిష్టంగా ఏడు రోజులు పట్టవచ్చని తెలుస్తోంది.