AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒప్పో కొత్త వాచ్‌లో ఈ ఫీచర్లు మామూలుగా లేవు! వర్కౌట్స్‌ చేసే వాళ్ల కోసం మరిన్ని స్పెషల్స్‌

Oppo Watch S2.. స్మార్ట్‌వాచ్ కొనాలని చూస్తున్న వారికి Oppo నుంచి త్వరలోనే కొత్త మోడల్‌ రాబోతోంది. ఇప్పటివరకు లీకులు, ఊహాగానాలకే పరిమితమైన Oppo Watch S2పై కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 22న చైనాలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ వాచ్‌ను విడుదల చేయనుంది. ఇదే వేదికపై Oppo Find X10 సిరీస్‌ను కూడా పరిచయం చేయనుంది.

ఒప్పో కొత్త వాచ్‌లో ఈ ఫీచర్లు మామూలుగా లేవు! వర్కౌట్స్‌ చేసే వాళ్ల కోసం మరిన్ని స్పెషల్స్‌
Oppo Watch S2
Nikhil
|

Updated on: Sep 19, 2026 | 6:20 AM

Share

కొత్త స్మార్ట్‌వాచ్‌లో సాధారణ ఆరోగ్య పర్యవేక్షణతో పాటు వర్కవుట్‌కు ఉపయోగపడే ప్రత్యేక సౌకర్యాలను అందించారు. ముఖ్యంగా FatMax Super Fat Burning Mode ఈ వాచ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. హార్ట్‌రేట్ ఆధారంగా వ్యాయామ సమయంలో వ్యక్తిగత కొవ్వు కరిగింపు వివరాలను చూపించే ఈ సౌకర్యంతో పాటు 10 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందించనున్నట్లు కంపెనీ చెబుతోంది.

ప్రీమియం లుక్..

డిజైన్ పరంగా ఈ వాచ్ గత తరం Watch S1ను పోలి ఉంటుంది. రౌండ్ డయల్‌తో స్టైలిష్‌గా కనిపించేలా రూపొందించారు. స్ట్రాప్ లేకుండా కేవలం 34.4 గ్రాముల బరువు ఉంటుంది. మందం 8.9 మిల్లీమీటర్లు. చేతికి పెట్టుకున్నప్పుడు ప్రీమియం అనుభూతి కలిగేలా దీన్ని తయారు చేశారు. రంగుల విషయానికి వస్తే Vibrant Orange, Misty Powder, Mountain Shadow Gray ఎంపికలు ఉన్నాయి. చైనాలో ఇప్పటికే ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. అయితే ఇతర మార్కెట్లలో విడుదల తేదీ, ధరపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.

లైవ్ అప్‌డేట్స్..

ఈ వాచ్‌లో కొత్తగా FatMax Super Fat Burning Modeను అందించారు. వ్యాయామ సమయంలో హార్ట్‌రేట్‌ను ఆధారంగా చేసుకుని వ్యక్తిగత కొవ్వు కరిగింపు ప్రక్రియకు ఇది సహాయపడుతుంది. ఎంత కొవ్వు కరిగిందనే సమాచారాన్ని గ్రాఫిక్స్ రూపంలో చూపిస్తుంది. కొత్త సెన్సార్‌తో హార్ట్‌రేట్ కచ్చితత్వం 98.8 శాతానికి చేరిందని Oppo చెబుతోంది. బయటి అంతరాయాలను 75 శాతం వరకు తగ్గించినట్లు పేర్కొంది.

బ్యాటరీ విషయానికి వస్తే ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. సాధారణ వినియోగంలో వారం రోజుల వరకు, Always-on Display నిరంతరం ఆన్‌లో ఉన్నా దాదాపు నాలుగు రోజుల బ్యాకప్ లభిస్తుందని తెలిపింది.

ఇక ఫుడ్ డెలివరీ వివరాలు, క్యాబ్ బుకింగ్ సమాచారం, నేవిగేషన్ వంటి Live Activitiesను నేరుగా వాచ్ స్క్రీన్‌పైనే చూసే సౌకర్యం కూడా ఉంది. దీంతో ఆరోగ్య పర్యవేక్షణతో పాటు రోజువారీ అవసరాలకు ఉపయోగపడేలా ఈ వాచ్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.

Follow Us