AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైళ్ల పాత బోగీలు, ఇంజిన్లు వృథాగా పోవు.. రైల్వేశాఖ వాటితో ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

రైలు కోచ్‌లు, ఇంజిన్లకు కూడా రిటైర్మెంట్ ఉంటుందనే విషయం మీకు తెలుసా..? రైల్వే నిబంధనల ప్రకారం ప్రతీ కోచ్, ఇంజిన్‌కు కాలపరిమితి ఉంటుంది. ఈ నిర్ణీత కాలపరిమితి తర్వాత వాటిని ఉపయోగించరు. వాటిని వేరే అవసరాల కోసం వినియోగిస్తారు. ఏం చేస్తారంటే..

Indian Railways: రైళ్ల పాత బోగీలు, ఇంజిన్లు వృథాగా పోవు.. రైల్వేశాఖ వాటితో ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Indian Railways
Venkatrao Lella
|

Updated on: Nov 09, 2026 | 11:17 AM

Share

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో భారతీయ రైల్వే నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం రైళ్లను అప్‌గ్రేడ్ చేస్తున్న రైల్వేశాఖ.. ఇప్పటికే సెమీ హైస్పీడ్ రైళ్లు అయిన వందే భారత్, వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే ఏడాదిలో దేశంలో తొలి హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్‌ను కూడా తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అహ్మదాబాద్-ముంబై హైస్పీడ్ రైలు కారిడార్‌లో తొలి బుల్లెట్ రైలు ప్రవేశపెట్టనున్నాయి. అయితే రైలుకు ఒక నిర్ణీత కాలపరిమితి ఉంటుంది. ఆ కాలపరిమితి తర్వాత బోగీలు, ఇంజిన్లను ఉపయోగించడం నిలిపివేస్తారు. కాలపరిమితి తర్వాత ఇంజిన్లు, బోగీలకు ఏం చేస్తారనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం.

కోచ్‌ల కాలపరిమతి ఎంత..?

కోచ్‌ల రకాన్ని బట్టి వాటికి కాలపరిమితిని రైల్వేశాఖ నిర్ణయిస్తుంది. నీలం రంగు ఐసీఎఫ్ కోచ్‌ల కాలపరిమితి 25 ఏళ్లుగా ఉండగా.. ఎరువు రంగు ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల నిర్ణీత కాలపరిమితి 30 నుంచి 35 ఏళ్లుగా ఉంది. ఇక డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్ల కాలపరిమితి 30 నుంచి 35 ఏళ్లుగా ఉంటుంది. ఈ కాలపరిమితి ముగిసిన తర్వాత బోగీలు, ఇంజిన్లను రైళ్లకు ఉపయోగించరు. అలా అని వాటిని వృధాగా వదిలేయరు. ఆ బోగీలు, కోచ్‌లను వేరే అవసరాల కోసం ఉపయోగిస్తారు. సర్వీస్ కాలం ముగిసిన తర్వాత ఆ కోచ్‌లను నిపుణుల బృందం పరిశీలీస్తుంది. వాటి దృఢత్వాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వేరే అవసరాల కోసం వినియోగించడంపై నిర్ణయం తీసుకుంటారు. బాగున్న కోచ్‌లను సరుకు రవాణా కోసం ఉపయోగిస్తారు. కోచుల్లోని సీట్లు, ఫ్యాన్లు, లైట్ల వంటి వాటిని తొలగించి సరుకు రవాణా బోగీలుగా మారుస్తారు.  కార్లు, బైక్‌లు, ఇతర సరుకు రవాణా కోసం ఈ బోగీలు వినియోగిస్తారు.

పూర్తిగా పాడైతే ఏం చేస్తారంటే..?

ఇక మరికొన్ని కోచ్‌లను ట్రాక్ సిబ్బంది విడిది కేంద్రాల కోసం కేటాయిస్తారు. అలాగే ప్రమాద సహాయక రైళ్లుగా మరికొన్ని బోగీలను వినియోగిస్తారు. ఇలా వివిధ అవసరాల కోసం కాలపరిమితి ముగిసిన కోచ్‌లు ఉపయోగపడతాయి. ఇక చారిత్రక ప్రాధాన్యత కలిగిన కోచ్‌లు, ఇంజిన్లను రైల్వే మ్యూజియంలో ఉంచుతారు. ఇటీవల రైల్వే కోచ్‌లను రెస్టారెంట్ థీమ్‌గా కూడా మార్చి ప్రయాణికులకు కొత్త అనుభూతిని అందిస్తున్నారు. ఇక పూర్తిగా పాడైన కోచ్‌ల, ఇంజిన్లను రైల్వేశాఖ ఆధ్వర్యంలోని వర్క్ షాపులకు తరలిస్తారు. చక్రాలు, స్ప్రింగ్‌లు, విలువైన విడిభాగాలను వేరుచేస్తారు. ఇవి పనికొస్తే ఇతర అవసరాల కోసం వినియోగిస్తారు. లేకపోతే ఈ-వేలం ద్వారా స్క్రాప్‌ను విక్రయిస్తారు. ఈ వేలం ద్వారా రైల్వేశాఖకు భారీగా ఆదాయం లభిస్తోంది. దీంతో కోచ్‌ల సర్వీస్ కాలం ముగిసిన తర్వాత కూడా ఏదొక రకంగా ఉపయోగపడతాయి. అంతేకానీ వృధాగా పోయేది ఏమీ ఉండదు.

Follow Us
అందుకే రా పాకిస్తాన్ టీం అనేది.. క్యాచ్ వదిలేసి గొడవపడ్డ ఆటగాళ్లు
అందుకే రా పాకిస్తాన్ టీం అనేది.. క్యాచ్ వదిలేసి గొడవపడ్డ ఆటగాళ్లు
నో మొబైల్‌.. రోజుకు 10 గంటల చదువు.. UPSC టాపర్ సక్సెస్ స్టోరీ!
నో మొబైల్‌.. రోజుకు 10 గంటల చదువు.. UPSC టాపర్ సక్సెస్ స్టోరీ!
పాత బోగీలు, ఇంజిన్లను రైల్వేశాఖ ఏం చేస్తుందో తెలుసా..?
పాత బోగీలు, ఇంజిన్లను రైల్వేశాఖ ఏం చేస్తుందో తెలుసా..?
మటన్ లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
మటన్ లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
ఒకే వయసు.. ఒకే మార్కులు.. కానీ కాలేజీ చదువులో భారీ వ్యత్యాసం..
ఒకే వయసు.. ఒకే మార్కులు.. కానీ కాలేజీ చదువులో భారీ వ్యత్యాసం..
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..