AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: అందుకే రా పాకిస్తాన్ టీం అనేది.. క్యాచ్ వదిలేసి గొడవపడ్డ ఆటగాళ్లు.. వీడియో చూస్తే నవ్వులే..!

India U19 vs Pakistan U19: క్రికెట్ మైదానంలో పాకిస్థాన్ ఫీల్డర్ల మరో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. భారత్ అండర్-19తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో ముగ్గురు పాక్ ఆటగాళ్లు సులభమైన క్యాచ్‌ను వదిలేశారు. అంతేకాదు, ఆ తప్పిదం తర్వాత ఒకరిపై ఒకరు అసహనం వ్యక్తం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Video: అందుకే రా పాకిస్తాన్ టీం అనేది.. క్యాచ్ వదిలేసి గొడవపడ్డ ఆటగాళ్లు.. వీడియో చూస్తే నవ్వులే..!
Pakistan Cricekt Team Viral Video
Venkata Chari
|

Updated on: Nov 09, 2026 | 11:16 AM

Share

India U19 vs Pakistan U19: క్రికెట్‌లో క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాన్ని మార్చగలవు. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్ (India vs Pakistan) జట్ల మధ్య మ్యాచ్‌ల్లో చిన్న తప్పిదాలు కూడా తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అయితే పాకిస్థాన్ అండర్-19 (Pakistan U19) జట్టు మాత్రం ఫీల్డింగ్‌లో చేసిన ఓ పొరపాటుతో వార్తల్లో నిలిచింది. ఒమన్‌లో జరుగుతున్న 2026 అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా నవంబర్ 8న భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఒక క్యాచ్ కోసం ముగ్గురు.. చివరకు నేలపాలు!

మస్కట్‌లోని అల్ అమరత్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ చివరి దశలో ఆసక్తికర ఘటన జరిగింది. భారత టెయిలెండర్ కావ్య పరేష్ పటేల్ (Kavya Paresh Patel) పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సయ్యమ్ (Mohammad Sayyam) బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో గాల్లోకి ఎగిరింది.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: 109 పరుగులే టార్గెట్.. 7 వికెట్లు పడినా భారత్ ఎలా గెలిచింది.. డీఎల్‌ఎస్ మెథడ్ పూర్తి లెక్క ఇదే..!

దీంతో బౌలర్ సయ్యమ్, వికెట్ కీపర్ హంజా జహూర్ (Hamza Zahoor), మరో ఫీల్డర్ క్యాచ్ అందుకోవడానికి ఒకే చోటుకు చేరుకున్నారు. కానీ ముగ్గురిలో ఎవరూ ఆ క్యాచ్‌ను అందుకోలేకపోయారు. బంతి నేరుగా వారి మధ్యలో నేలపై పడింది. సులభంగా పట్టుకోవాల్సిన క్యాచ్ చేజారడంతో పాక్ ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేశారు.

క్యాచ్ మిస్.. ఆ తర్వాత మాటల యుద్ధం..!

ఈ తప్పిదం జరిగిన వెంటనే పాకిస్థాన్ ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. క్యాచ్ ఎవరు పట్టుకోవాలనే విషయంలో స్పష్టత లేకపోవడంతో ఒకరిపై ఒకరు అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించింది. మైదానంలో జరిగిన ఈ గందరగోళానికి సంబంధించిన దృశ్యాలు క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాయి.

గతంలోనూ ఇలాంటి ఫీల్డింగ్ తప్పిదాలు..!

పాకిస్థాన్ జట్టుకు ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు వదిలేయడం కొత్తేమీ కాదు. గతంలో సయీద్ అజ్మల్ (Saeed Ajmal), షోయబ్ మాలిక్ (Shoaib Malik) మధ్య జరిగిన ఫీల్డింగ్ సమన్వయ లోపం కూడా క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. 2011 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్‌తో మ్యాచ్, 2015 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో పోరు, 2021 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లోనూ పాకిస్థాన్ ఫీల్డింగ్‌పై విమర్శలు వచ్చాయి.

ఎక్కువమంది చదివినది: SRH Retention List: కమిన్స్‌కు కావ్య మారన్ షాక్.. హైదరాబాద్ నుంచి ఆ 8 మంది ఔట్?

భారత్ 208 పరుగులకే ఆలౌట్..!

ఇక ఈ క్యాచ్‌ను వదిలేసినప్పటికీ పాకిస్థాన్ బౌలర్లు మిగతా భారత బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత అండర్-19 జట్టు 46.3 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. దీంతో 209 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ ముందు ఉంచింది. ఈ విజయంతో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలవాలని పాక్ యువ జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అందుకే రా పాకిస్తాన్ టీం అనేది.. క్యాచ్ వదిలేసి గొడవపడ్డ ఆటగాళ్లు
అందుకే రా పాకిస్తాన్ టీం అనేది.. క్యాచ్ వదిలేసి గొడవపడ్డ ఆటగాళ్లు
నో మొబైల్‌.. రోజుకు 10 గంటల చదువు.. UPSC టాపర్ సక్సెస్ స్టోరీ!
నో మొబైల్‌.. రోజుకు 10 గంటల చదువు.. UPSC టాపర్ సక్సెస్ స్టోరీ!
పాత బోగీలు, ఇంజిన్లను రైల్వేశాఖ ఏం చేస్తుందో తెలుసా..?
పాత బోగీలు, ఇంజిన్లను రైల్వేశాఖ ఏం చేస్తుందో తెలుసా..?
మటన్ లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
మటన్ లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
ఒకే వయసు.. ఒకే మార్కులు.. కానీ కాలేజీ చదువులో భారీ వ్యత్యాసం..
ఒకే వయసు.. ఒకే మార్కులు.. కానీ కాలేజీ చదువులో భారీ వ్యత్యాసం..
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..