AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా..?

IPL 2027 Retention: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే ఫ్రాంచైజీల మధ్య ట్రేడింగ్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. పలువురు స్టార్ ఆటగాళ్లు జట్లు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లకు కొత్త కెప్టెన్లు రావచ్చని మాజీ ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అంచనా వేశాడు. రోహిత్, బుమ్రా, రింకూ పేర్లు తెరపైకి వచ్చాయి.

Venkata Chari
|

Updated on: Nov 09, 2026 | 10:51 AM

Share
IPL 2027 Retention: ఐపీఎల్ (IPL) 2027 సీజన్‌కు ముందే ఆటగాళ్ల ట్రేడింగ్ వ్యవహారం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య నలుగురు ఆటగాళ్ల బదిలీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. లియామ్ లివింగ్‌స్టోన్ (Liam Livingstone), జాక్ ఎడ్వర్డ్స్ (Jack Edwards) చెన్నై జట్టులోకి వెళ్లగా.. ఖలీల్ అహ్మద్ (Khaleel Ahmed), నాథన్ ఎల్లిస్ (Nathan Ellis) సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చేరారు. ఈ పరిణామాల మధ్య మూడు ప్రధాన జట్ల కెప్టెన్సీపై ఆసక్తికర చర్చ మొదలైంది.

1 / 6
మూడు జట్లకు కొత్త సారథులు? మాజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (Faf du Plessis) ESPNcricinfo వీడియోలో ఐపీఎల్ 2027 కెప్టెన్సీపై తన అంచనాలను వెల్లడించాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ముంబై ఇండియన్స్ (MI) జట్లకు కొత్త నాయకులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.

2 / 6
లక్నో కెప్టెన్‌గా మార్క్‌రమ్ లేదా మార్ష్..! రిషబ్ పంత్ (Rishabh Pant) ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లిపోవడంతో లక్నో జట్టుకు కొత్త కెప్టెన్ అవసరం ఏర్పడింది. ఈ బాధ్యతలను ఐడెన్ మార్క్‌రమ్ (Aiden Markram) లేదా మిచెల్ మార్ష్ (Mitchell Marsh) చేపట్టవచ్చని ఫాఫ్ అంచనా వేశాడు. గత రెండు సీజన్లలో లక్నో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ గెలవలేదు.

3 / 6
కేకేఆర్ పగ్గాలు రింకూ చేతుల్లోకి? కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) తిరిగి రావడంతో ఆ జట్టు నాయకత్వంపై సందిగ్ధత నెలకొంది. రింకూ సింగ్ (Rinku Singh)కు కెప్టెన్సీ అప్పగించే అవకాశం ఉందని ఫాఫ్ పేర్కొన్నాడు. ఒకవేళ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ట్రేడ్ ద్వారా కేకేఆర్‌లోకి వస్తే అతడికి కూడా సారథ్య బాధ్యతలు దక్కవచ్చని అభిప్రాయపడ్డాడు.

4 / 6
ముంబై కెప్టెన్‌గా రోహిత్ లేదా బుమ్రా..: ముంబై ఇండియన్స్ విషయంలోనూ ఫాఫ్ ఆసక్తికర అంచనా వేశాడు. హార్దిక్ పాండ్యా జట్టులో కొనసాగుతాడా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ అతడు ముంబైని వీడితే రోహిత్ శర్మ (Rohit Sharma) లేదా జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టవచ్చని తెలిపాడు. 2026 సీజన్‌లో ముంబై పదో జట్లలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

5 / 6
పంజాబ్ రేసులో ముందంజలో హార్దిక్..: ఇదిలా ఉంటే, హార్దిక్ పాండ్యాను ట్రేడ్ ద్వారా దక్కించుకునే ప్రయత్నాల్లో పంజాబ్ కింగ్స్ (PBKS) ముందంజలో ఉన్నట్లు ఐఏఎన్ఎస్ (IANS) కథనం వెల్లడించింది. కోల్‌కతా, రాజస్థాన్ రాయల్స్, లక్నో జట్లు కూడా అతడి కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రతిపాదిత ఒప్పందంలో హార్దిక్ పంజాబ్‌కు వెళ్తే.. అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh), విష్ణు వినోద్ (Vishnu Vinod) ముంబైకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఈ బదిలీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నవంబర్ 17 రిటెన్షన్ గడువుకు ముందు ఈ వ్యవహారాలు కొలిక్కి వస్తాయా? ఐపీఎల్ 2027లో నిజంగానే మూడు జట్లకు కొత్త కెప్టెన్లు వస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

6 / 6
Follow Us
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?

కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న

చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..

మీ కారును కూడా హ్యాక్ చేయొచ్చా? ఇంటర్నెట్‌తో నడిచే కార్లకు ముప్పు

నిన్ను చూసి నవ్వినవారే రేపు నిన్ను చూసి గర్వపడాలంటే.. ఈ కథ చదవండి

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే..

హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..

పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ

గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..

చలికాలంలో కళ్ల మంట, దురద, నీళ్లు వస్తున్నాయా? ఇలా కాపాడుకోండి