Chat GPT: చాట్‌ జీపీటీలో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌.. ఇకపై వినొచ్చు..

చాట్‌ జీపీటీ టెక్‌ రంగంలో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూజర్లకు సమాచారాన్ని అందించడంలో సరికొత్త విప్లవం తీసుకొచ్చిందీ చాట్‌బాట్‌. ఓపెన్‌ఏఐ సంస్థ తీసుకొచ్చిన చాట్‌జీపీటీతో ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో ఇచ్చేస్తుంది. అది కూడా కచ్చితత్వంతో. దీంతో చాట్‌ జీపీటీ సేవలను వినియోగిస్తున్న వారి సంఖ్య జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతుంది. ఇక ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను అట్రాక్ట్‌ చేస్తూ వస్తున్న చాట్‌జీపీటీ తాజాగా మోరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. […]

Chat GPT: చాట్‌ జీపీటీలో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌.. ఇకపై వినొచ్చు..
Chat Gpt
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 05, 2024 | 7:16 PM

చాట్‌ జీపీటీ టెక్‌ రంగంలో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూజర్లకు సమాచారాన్ని అందించడంలో సరికొత్త విప్లవం తీసుకొచ్చిందీ చాట్‌బాట్‌. ఓపెన్‌ఏఐ సంస్థ తీసుకొచ్చిన చాట్‌జీపీటీతో ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో ఇచ్చేస్తుంది. అది కూడా కచ్చితత్వంతో. దీంతో చాట్‌ జీపీటీ సేవలను వినియోగిస్తున్న వారి సంఖ్య జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతుంది.

ఇక ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను అట్రాక్ట్‌ చేస్తూ వస్తున్న చాట్‌జీపీటీ తాజాగా మోరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ‘రీడ్‌ ఏ లౌడ్‌’ పేరుతో యూజర్లకు కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు ఇకపై సమాధానాలను చదవడమే కాకుండా వినొచ్చు కూడా. ఫోన్‌ లేదా కంప్యూటర్‌లో చదవలేవని పరిస్థితిలో ఉంటే చదువి వినిపిస్తుంది. వెబ్‌ వెర్షన్‌తో పాటు ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యాప్స్‌లోనూ ఇది అందుబాటులోకి వచ్చింది.

ఇక ఈ కొత్త ఫీచర్‌ జీపీటీ-4, జీపీటీ-3.5 మోడళ్లలోనూ పనిచేస్తుంది. ఈ ఫీచర్‌లో మొత్తం 37 భాష్లలోనే టెక్ట్స్‌ను చదవగలుగుతుంది. భాషను తనకు తానే గుర్తించి వివరిస్తుంది ప్రత్యేకంగా లాంగ్వెజ్‌ను సెలక్ట్ చేసుకోవాల్సిన పనిలేదు. మొబైల్‌ యాప్‌లలో టెక్ట్స్‌పై క్లిక్‌ చేసి పట్టుకుంటే ఆప్షన్స్‌లో ‘రీడ్‌ ఏ లౌడ్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఎంపిక చేసుకుంటే ఫీచర్‌ యాక్టివేట్ అవుతుంది. వెబ్‌వెర్షన్‌లో చాట్‌జీపీటీ (ChatGPT) ఇచ్చే సమాధానం కింద స్పీకర్‌ గుర్తు కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

ఇదిలా ఉంటే చాట్‌జీపీటీ వాడకాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగే ఓపెన్‌ఏఐ ఎన్నో రకాల ఫీచర్లను ప్రవేశపెడుతుంది. వాయిస్‌తో కమాండ్లను ఇచ్చే ఆప్షన్‌ను ప్రవేశపెట్టిన ఓపెన్‌ఏఐ తాజాగా ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. మరి ఓపెన్‌ఏఐ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌కి గూగుల్‌ బర్డ్‌లో ఎలాంటి మార్పులు చేస్తారో చూడాలి.

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..