Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OnePlus Ace 2 Pro: ఓన్లీ వన్ ప్లస్.. ఏకంగా 24జీబీ ర్యామ్, 1టీబీ మెమరీ.. ప్రపంచంలో మొట్టమొదటి ఆండ్రాయిడ్ ఫోన్.. పూర్తి వివరాలు ఇవి..

ప్రపంచంలోనే అత్యధిక ర్యామ్ సైజ్ కలిగిన స్మార్ట్ ఫోన్ ను వన్ ప్లస్ ఆవిష్కరించింది. ఏకంగా 24జీబీ ర్యామ్ తో పాటు 1 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. దీనికి వన్ ప్లస్ ఏస్2 ప్రో అని పేరు పెట్టింది. ఆండ్రాయిడ్ ఫోన్ల కంపెనీలలో ఇంత పెద్ద ర్యామ్ సైజ్ తో వస్తున్న మొట్టమొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ అధిక ర్యామ్ సైజ్ కారణంగా వినియోగదారులకు ముఖ్యంగా గేమింగ్ ను ఇష్టపడేవారికి, మల్టీ టాస్కింగ్ చేసే వారికి బాగా ఉపయుక్తంగా మారుతుంది.

OnePlus Ace 2 Pro: ఓన్లీ వన్ ప్లస్.. ఏకంగా 24జీబీ ర్యామ్, 1టీబీ మెమరీ.. ప్రపంచంలో మొట్టమొదటి ఆండ్రాయిడ్ ఫోన్.. పూర్తి వివరాలు ఇవి..
Oneplus Ace 2 Pro
Follow us
Madhu

|

Updated on: Aug 20, 2023 | 11:59 AM

ఆండ్రాయిడ్ ఫోన్ల ఎంట్రీతో టెక్ ప్రపంచం వేగంగా పరుగెత్తడం ప్రారంభించింది. అత్యాధునిక ఫీచర్లు ఫోన్లలో అందుబాటులోకి వచ్చాయి. ఎక్కువ ర్యామ్, రోమ్ సైజులతో వేగంగా పనిచేయడానికి, అత్యధిక డేటాను ఫోన్లోనే స్టోర్ చేయడానికి వీలు ఏర్పడింది. అయితే దీనిని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ అడుగు వేసింది. ప్రపంచంలోనే అత్యధిక ర్యామ్ సైజ్ కలిగిన స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది. ఏకంగా 24జీబీ ర్యామ్ తో పాటు 1 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. దీనికి వన్ ప్లస్ ఏస్2 ప్రో అని పేరు పెట్టింది. ఆండ్రాయిడ్ ఫోన్ల కంపెనీలలో ఇంత పెద్ద ర్యామ్ సైజ్ తో వస్తున్న మొట్టమొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ అధిక ర్యామ్ సైజ్ కారణంగా వినియోగదారులకు ముఖ్యంగా గేమింగ్ ను ఇష్టపడేవారికి, మల్టీ టాస్కింగ్ చేసే వారికి బాగా ఉపయుక్తంగా మారుతుంది. సులభంగా, వేగంగా పనిచేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం రండి..

ప్రధాన స్పెసిఫికేషన్లు..

వన్ ప్లస్ 11ఆర్, వన్ ప్లస్ 11 లను కలిపి రెండింటిలోనూ ఫీచర్లు, స్పెక్స్ లను జోడించి వన్ ప్లస్ ఏస్ 2 ప్రో ఫోన్ ను తయారు చేశారు. ఈ స్మార్ట్ ఫోన్లో వన్ ప్లస్ 11లో ఉన్న స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్ సెట్ ఉంటుంది. అలాగే వన్ ప్లస్ 11ఆర్ లో ఉన్నట్లు దీనిలో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపీ మాక్రో లెన్స్ ఉంటాయి.

వన్ ప్లస్ ఏస్ 2 ప్రో స్మార్ట్ ఫోన్లో 6.74 అంగుళాల అమోల్డ్ ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. అలాగే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఈ ఫోన్ కలర్ ఓఎస్ 13.1పై పనిచేసే ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఆధారపడి పనిచేస్తుంది. అయితే గ్లోబల్ వైడ్ గా అందుబాటులో ఉన్న ఫోన్లో మాత్రం ఓక్సిజెన్ ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. వన్ ప్లస్ ఏస్ 2 ప్రో ఫోన్లో 5,000ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంటుంది. 150 వాట్ల సామర్థ్యంతో ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ధర లభ్యత..

24జీబీ ర్యామ్, 1టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ టాప్ వేరియంట్ వన్ ప్లస్ ఏస్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ ధర 3,999 యాన్లు అంటే మన కరెన్సీలో రూ. 46,079 వరకూ ఉంటుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉందో లేదో ఇంకా క్లారిటీ లేదు. అయితే రానున్న కాలంలో వన్ ప్లస్ 11టీ మోనికర్ తో పాటు ఏస్ 2 ప్రో కూడా ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వన్ ప్లస్ ప్రకటించింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..