OnePlus Nord CE 5G: 64 మెగాపిక్సెల్ కెమెరాతో రానున్న వన్‌ప్లస్ నార్డ్.. అధికారికంగా ప్రకటించిన టెక్ దిగ్గజం..
OnePlus Nord CE 5G: భారత మార్కెట్లో వన్‌ప్లస్ ఫోన్‌కు ఉన్న ఆధరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ టెక్ దిగ్గజం సరికొత్త ఫీచర్లతో యూజర్లను...
OnePlus Nord CE 5G: భారత మార్కెట్లో వన్‌ప్లస్ ఫోన్‌కు ఉన్న ఆధరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ టెక్ దిగ్గజం సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా తక్కువ బడ్జెట్‌లో వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ పేరుతో రానున్న ఈ ఫోన్‌ను ఈనెల 10న మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే గతకొన్నిరోజులుగా ఈ ఫోన్ ఫీచర్లపై వార్తలు వస్తున్నాయి. తాజాగా వన్‌ప్లస్ అధికారికంగా కెమెరాకు సంబంధించిన వివరాలను నెటిజన్లతో పంచుకుంది. వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నట్లు వన్‌ప్లస్ ప్రకటించింది. జూన్ 10 నుంచి అందుబాటులోకి రానున్న వన్‌ప్లస్ నార్డ్ ఫోన్‌ను అమేజాన్‌లో అందుబాటులో ఉండనుంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ ఫీచర్లు.. (అంచనా)
* ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌గ్రాగన్ 750జీ ఎస్ఓసీ ప్రాసెసర్.
* 6.43 అంగుళాల హెచ్‌డీ+, ఆమోఎల్ఈడీ డిస్‌ప్లే.
* 8 జీబీ ర్యామ్‌తో పాటు 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఈ ఫోన్ సొంతం.
* 4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో పాటు 30టీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశాలున్నాయి.
View this post on Instagram
గబ్బిలాల గుహలో చైనా పరిశోధకులు…వైరస్ లీక్ థియరీ….అనుమానాలకు బలాన్నిస్తున్న చైనా టీవీ వీడియో
CM Jagan: విషమ పరిస్థితుల్లో డాక్టర్.. వెంటనే స్పందించి రూ. కోటి విడుదల చేసిన సీఎం జగన్