- Telugu News Photo Gallery Technology photos Google released pixel earbuds features and price of earbuds
Google Earbuds: గూగుల్ నుంచి సరికొత్త వైర్‌లైస్ ఇయర్‌బడ్స్.. ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Google Earbuds: అధునాతన టెక్నాలజీ, గ్యాడ్జెట్లకు పెట్టింది పేరైన గూగుల్ తాజాగా ఇయర్ బడ్స్‌ను తీసుకొచ్చింది. గూగుల్ పిక్సెల్ బడ్స్ పేరుతో విడుదల చేసిన ఈ ఇయర్ బడ్స్ ఫీచర్ల విషయానికొస్తే..
Updated on: Jun 05, 2021 | 1:26 PM

ప్రపంచ టెక్ రంగంలో గూగుల్‌కు ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్యాడ్జెట్ల రూపకల్పనలో తనదైన ముద్ర వేసింది గూగుల్.

ఇప్పటికే పలు విప్లవాత్మక గ్యాడ్జెట్లను తీసుకొచ్చిన గూగుల్.. తాజాగా అధునాతన టెక్నాలజీతో కూడిన వైర్‌లెస్ ఇయర్‌బెడ్స్‌ను విడుదల చేసింది.

గూగుల్ పిక్సెల్ బడ్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఇయర్స్ ధర 99 డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ. 7,200.

ప్రస్తుతం కెనెడా, అమెరికాలో అందుబాటులో ఉన్న ప్రాడక్ట్ త్వరలోనే భారత్‌లో అందుబాటులోకి రానుంది.

పరిసరాల ఆధారంగా వాల్యూమ్ పెరగడం, తగ్గడంతో పాటు బయటి శబ్ధాలు వినిపించకపోవడం వీటి ప్రత్యేకత.

15నిమిషాలు ఛార్జింగ్ పెడితే 3గంటల పాటు వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా.. హలో గూగుల్, ట్రాన్స్‌లేషన్, నోటిఫికేషన్లు పొందొచ్చు.




