- Telugu News Photo Gallery Science photos What would happen to earth if there was no moon on space intresting information for you
Moon Importance: ఆకాశంలో చంద్రుడు లేకపోతే భూమికి ఏమి జరుగుతుంది?.. ఆసక్తికర విశేషాలు మీకోసం..
Moon Importance : చంద్రుడు లేకపోతే భూమికి ఏమి జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jun 05, 2021 | 9:36 PM

చంద్రుడు భూమి నుండి సుమారు 3 లక్షల 84 వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. చీకట్లో వెన్నెల రూపంలో భూమికి కాంతిని ప్రసరింపజేసే చందమామ రూపం చూడముచ్చటగా ఉంటుందనేది తెలిసిందే. అయితే, ఆ అందమైన చందమామ లేకపోతే భూమి ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? చందమామ లేకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

చంద్రుని తరువాత ఆకాశంలో మరేదైనా ప్రకాశవంతంగా ఉందంటే అది శుక్ర గ్రహం. అయితే, ఆ శుక్ర గ్రహం చంద్రుడిలా ఆకాశాన్ని ప్రకాశవంతం చేయలేదు. పౌర్ణమి రోజున ప్రకాశవంతమైన చంద్రుడు.. శుక్రుడి కంటే రెండు వేల రెట్లు కాంతిని ప్రసరింపజేస్తాడు. అలాంటి చంద్రుడు భూమికి ఉపగ్రహంగా లేకపోతే.. మనం నిత్యం చిమ్మ చీకట్లలో మగ్గిపోవాల్సిందే.

భూమి నుంచి చంద్రుడు కనిపించకుండా ఒక రోజు 6 నుంచి 12 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ విధంగా, సంవత్సరంలో వెయ్యి రోజులకు పైగా ఉండవచ్చు. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి కారణంగా భూమి యొక్క భ్రమణం నియంత్రణలో ఉంటుంది. అంటే ఒక రోజు పూర్తి కావడానికి 24 గంటల సమయం పడుతుంది. అదే చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి లేకపోతే, భూమి వేగంగా తిరుగుతుంది. ఫలితంగా ఒక రోజు అత్యంత వేగంగా గడిచిపోతుంది.

చంద్రుడు లేని భూమిపై.. సముద్రంలో అలల స్వరూపమే మారిపోతుంది. చంద్రుడు లేకపోతే, సముద్రపు అలల ధాటి ప్రస్తుత ప్రవాహంలో మూడింట ఒక వంతు మాత్రమే ఉంటుంది. అధిక ఆటుపోట్లు సంభవించవు. సూర్యుడు కూడా ఆటుపోట్లను ప్రభావితం చేస్తాడు కానీ.. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి భూమిపై చాలా బలహీనంగా ఉంటుంది. ఆ కారణంగా చంద్రుడు లేకపోతే సముద్రపు ఆటుపోట్లలో తేడాలు కనిపిస్తాయి.

చంద్రుడు లేకపోతే.. చంద్రగ్రహణం, సూర్యగ్రహణాలు ఏర్పడవు. చంద్రుడు లేనప్పుడు, సూర్యుడిని అడ్డగించే మరో గ్రహం ఉండదు కాబట్టి.. సూర్యగ్రహణం, చంద్ర గ్రహణం జరగదు.

చంద్రుడు లేకుంటే.. భూమి యొక్క అక్షం వాలు కాలక్రమేణా మారుతుంది. ఈ కారణంగా, భూమిపై ప్రమాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రస్తుతం, చంద్రుని కారణంగా మన భూమి 23.5 డిగ్రీల వద్ద వంగి ఉంటుంది. కానీ చంద్రుడు లేకుంటే భూమి ఎక్కువ అక్షం వాలు కలిగి ఉంటుంది. ఫలితంగా వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయి.




