AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OnePlus: వన్‌ప్లస్‌ ఫోన్‌లలో పెద్ద సమస్య.. ఆందోళనలో వినియోగదారులు.. కంపెనీ ఏం చెబుతోంది?

OnePlus: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు OnePlus కొన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ఒక పెద్ద లోపం వెలుగులోకి వచ్చింది OnePlus 9, OnePlus 10 సిరీస్‌లలో మదర్‌బోర్డులో సమస్య ఉందని తేలింది. దీంతో ఈ సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్లు కొన్నవారు ఆపరేట్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. గత వారం కొంతమంది వినియోగదారులు తమ ఫోన్‌లు అకస్మాత్తుగా పనిచేయడం మానేశాయని ఫిర్యాదులు చేస్తున్నారు. అదే సమయంలో..

OnePlus: వన్‌ప్లస్‌ ఫోన్‌లలో పెద్ద సమస్య.. ఆందోళనలో వినియోగదారులు.. కంపెనీ ఏం చెబుతోంది?
Onleplus
Subhash Goud
|

Updated on: Sep 03, 2024 | 10:10 AM

Share

OnePlus: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు OnePlus కొన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ఒక పెద్ద లోపం వెలుగులోకి వచ్చింది OnePlus 9, OnePlus 10 సిరీస్‌లలో మదర్‌బోర్డులో సమస్య ఉందని తేలింది. దీంతో ఈ సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్లు కొన్నవారు ఆపరేట్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. గత వారం కొంతమంది వినియోగదారులు తమ ఫోన్‌లు అకస్మాత్తుగా పనిచేయడం మానేశాయని ఫిర్యాదులు చేస్తున్నారు. అదే సమయంలో ఫోన్ మరమ్మత్తు ధర ప్రస్తుత మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య ఎక్కువగా OnePlus 9, 10 Pro ఎదురవుతోంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ తర్వాత ఇలా జరుగుతుందని గుర్తించారు.

ఖరీదైన మరమ్మత్తు ఖర్చులు:

వినియోగదారుల నుంచి సమాచారం ప్రకారం.. OnePlus ఫోన్ లోపభూయిష్టమైన మదర్‌బోర్డ్‌ను భర్తీ చేయడానికి OnePlus సర్వీస్ రిపేర్ టీమ్ రూ. 42 వేలు కోట్ చేసిందని చెబుతున్నారు. ఇది కొత్త OnePlus 10 Pro ప్రస్తుత మార్కెట్ విలువకు దగ్గరగా ఉంటుంది. కంపెనీ మీడియాతో మాట్లాడుతూ, ‘యూజర్‌లు తమ వన్‌ప్లస్ 9, 10 ప్రోతో ఫోన్‌ మదర్‌బోర్డ్‌కు సంబంధించిన కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్న కొన్ని ఇటీవలి కేసుల గురించి వినడం మాకు చాలా బాధగా ఉంది. అయితే దీని వెనుక కారణాన్ని కంపెనీ ఇంకా పరిశీలిస్తోంది. మేము వీలైనంత త్వరగా ప్రభావితమైన వినియోగదారుల సమస్యను పరిష్కరిస్తామని చెబుతోంది.

ఇవి కూడా చదవండి

కంపెనీ సమాచారం ఏంటంటే..

మదర్‌బోర్డు మరమ్మతులు ఖరీదైనవిగా ఉంటాయని మాకు తెలుసు. అయితే వాటిని మరింత సరసమైన ధరకు అందించడానికి కృషి చేస్తున్నాము. ఇలాంటి సమస్యతో ప్రభావితమైన కస్టమర్‌లు ఎవరైనా కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని అభ్యర్థిస్తున్నాము. తద్వారా మేము వీలైనంత త్వరగా పరిస్థితిని పరిష్కరించడంలో సహాయం చేస్తాము అని కంపెనీ చెబుతోంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి