OnePlus Tab: త్వరలో వన్‌ప్లస్ ట్యాబ్.. ఆ సైట్ నుంచి ప్రీ ఆర్డర్ చేసుకునే అవకాశం..

ఈ వన్‌ప్లస్ ట్యాబ్ ఏప్రిల్ నుంచి వినియోగదారులు ప్రీ బుక్ చేసే అవకాశం కల్పిస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రీ బుకింగ్ సదుపాయం కూడా ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

OnePlus Tab: త్వరలో వన్‌ప్లస్ ట్యాబ్.. ఆ సైట్ నుంచి ప్రీ ఆర్డర్ చేసుకునే అవకాశం..
One Plus Tab
Follow us
Srinu

|

Updated on: Feb 17, 2023 | 4:30 PM

యాపిల్ తర్వాత మొబైల్ వినియోగదారులకు ఎక్కువగా ఆకట్టుకున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్. ముఖ్యంగా వన్‌ప్లస్ కెమెరా ద్వారా హైక్లాస్ ఫొటోలు తీసుకునే అవకాశం ఉండడంతో ఎక్కువ వన్‌ప్లస్ ఫోన్ కొనేందుకు ఆసక్తి చూపారు. సెల్ఫీ లవర్స్ ఈ ఫోన్ కొనేందుకు మక్కువ చూపారు. అంతటి ప్రాచుర్యం పొందిన వన్‌ప్లస్ బ్రాండ్ తర్వలో వన్‌ప్లస్ ట్యాబ్ తీసుకు వస్తుందని మార్కెట్‌లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఇటీవల నిర్వహించిన క్లౌడ్ 11 ఈవెంట్‌లో వన్‌ప్లస్ కంపెనీ ఈ ట్యాబ్‌ను పరిచయం చేసింది. అప్పటి నుంచి భారతీయ వినియోగదారులు ఈ ట్యాబ్‌ను కంపెనీ ఎప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉంచుతుందో? అని ఎదురుచూస్తున్నారు. ఈ వన్‌ప్లస్ ట్యాబ్ ఏప్రిల్ నుంచి వినియోగదారులు ప్రీ బుక్ చేసే అవకాశం కల్పిస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రీ బుకింగ్ సదుపాయం కూడా ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అయితే ఇది అధికారిక సమాచారం కాదని, కంపెనీ ప్రకటించే వరకూ ఈ ట్యాబ్ అప్‌డేట్స్ కోసం వేచి చూడాలని సూచిస్తున్నారు. 

వన్‌ప్లస్ ప్యాడ్ స్పెసిఫికేషన్లు ఇవే..

వన్‌ప్లస్ ప్యాడ్ ఆ కంపెనీ మొదటి ఆండ్రాయిడ్ సపోర్టెడ్ ప్యాడ్. ఇది 144 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ముఖ్యంగా ఈ ట్యాబ్ 11.64 అంగుళాల డిస్‌ప్లేతో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. తాజా వివరాల ప్రకారం 2800×2000 స్క్రీన్ రిజుల్యూషన్‌తో వస్తుంది. అలాగే మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ ఈ ప్యాడ్ ప్రతేకం. అలాగే ఆండ్రాయిడ్ 13 సపోర్టెడ్ ఆక్సిజన్ ఓఎస్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఈ వన్‌ప్లస్ ట్యాబ్‌లో డాల్బీ విజన్, డాల్బీ ఆట్మోస్, క్వాడ్ స్పీకర్ సెటప్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే వన్ ప్లస్ యూజర్లు ఎక్కువగా ఇష్టపడే కెమెరా విషయంలో మాత్రం ఈ ట్యాబ్ నిరుత్సాహానికి గురి చేస్తుంది. కేవలం 13 ఎంపీ కెమెరాను వెనుక వైపు ఇస్తున్నారు. అలాగే 8 ఎంపీ కెమెరాను కంపెనీ ఆఫర్ చేస్తుంది. 12 జీబీ+256 జీబీ వేరియంట్ వచ్చే ఈ ప్యాడ్ ధర విషయంలో మాత్రం కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!