AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాలుగు రోజుల్లో మార్కెట్లోకి మైండ్ బ్లోయింగ్ స్మార్ట్‌ఫోన్.. అబ్బురపరుస్తున్న ఫీచర్లు..

త్వరలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. నవంబర్ 27న నథింగ్ 3ఏ లైట్ ఫోన్ లాంచ్ కానుంది. అనేక ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు ఈ ఫోన్‌లో ఉన్న ఇతర ఫీచర్లు ఏంటో చూద్దాం.

నాలుగు రోజుల్లో మార్కెట్లోకి మైండ్ బ్లోయింగ్ స్మార్ట్‌ఫోన్.. అబ్బురపరుస్తున్న ఫీచర్లు..
Nothing 3a Lite
Venkatrao Lella
|

Updated on: Nov 23, 2025 | 2:44 PM

Share

Nothing 3a Lite: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మరో నాలుగు రోజుల్లో లాంచ్ చేసేందుకు సిద్దమైంది. మిండ్ స్థాయి రేంజ్‌లో తక్కువ ధరతో ఇండియన్ మార్కెట్లోకి ఈ ఫోన్ తీసుకొస్తుంది. ఆ ఫోనే నథింగ్ ఫోన్ 3A లైట్. నథింగ్ 3ఏ సిరీస్‌లో భాగంగా లేటెస్ట్ అప్‌గ్రేడ్ వెర్షన్‌గా 3ఏ ఫోన్ వస్తుంది. నవంబర్ 27న ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వర్గాలు ప్రకటించాయి. అక్టోబర్‌లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్ రిలీజ్ అవ్వగా.. ఇండియాలో ఆలస్యంగా లాంచ్ అవుతుంది. పవర్‌ఫుల్ ప్రాసెసర్, గ్రాఫిక్ ఇంటర్‌ఫేస్, స్ట్రైలిష్ డిజైన్‌తో ఈ ఫోన్ వస్తుంది.

నథింగ్ 3A లైట్ ఫోన్ వివరాలు

బ్లాక్, వైట్ రంగుల్లో ఫోన్

వెనుక భాగంలో మెరిసే గ్లిఫ్ లైట్లు

సిగ్నేచర్ సీ-త్రూ డిజైన్

120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్

3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్

1,000Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.77-అంగుళాల ఫుల్ HD+ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లే

మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్

మైక్రో SD కార్డ్ స్లాట్

ఫోన్ 50-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్ (f/1.88)

ముందు భాగంలో, 16-మెగాపిక్సెల్ (f/2.45) 5,000mAh బ్యాటరీ

33W ఫాస్ట్ ఛార్జింగ్

5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్

ఫోన్ ధర

8GB RAM+ 128GB, 256GB స్టోరేజ్ వేరియెంట్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ధర భారతదేశంలో రూ.24 వల నుంచి రూ.28 వేల మధ్య ఉండొచ్చని సమాచారం. ప్రముఖ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిఫ్‌కార్ట్ లేదా నంధింగ్ ఫోన్ స్టోర్స్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు.