Nokia Smartphones: నోకియా నుంచి కొత్తగా స్మార్ట్‌ ఫోన్‌లు.. మళ్లీ పూర్వ వైభవం రానుందా..?

Nokia Smartphones: ఒకప్పుడు మొబైల్‌ ఫోన్‌ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు నోకియా. అంతలా ఈ బ్రాండ్‌ పేరు పాతుకు పోయింది. మొబైల్‌ ఫోన్‌ అంటే నోకియా మాత్రమే అనే భావన చాలా మందిలో ఉండేది. అయితే కాలక్రమేణా పోటీతత్వం..

Nokia Smartphones: నోకియా నుంచి కొత్తగా స్మార్ట్‌ ఫోన్‌లు.. మళ్లీ పూర్వ వైభవం రానుందా..?
Nokia Smart Phones
Narender Vaitla

|

Apr 03, 2021 | 8:24 PM

Nokia Smartphones: ఒకప్పుడు మొబైల్‌ ఫోన్‌ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు నోకియా. అంతలా ఈ బ్రాండ్‌ పేరు పాతుకు పోయింది. మొబైల్‌ ఫోన్‌ అంటే నోకియా మాత్రమే అనే భావన చాలా మందిలో ఉండేది. అయితే కాలక్రమేణా పోటీతత్వం పెరగడం, స్మార్ట్‌ఫోన్‌లు రావడంతో నోకియా తన ప్రాభావ్యాన్ని కోల్పోతూ వచ్చింది. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్‌ ట్రెండ్‌ను నోకియా త్వరగా అందుకోకపోవడంతోనే రేసులో వెనుకబడిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇదిలా ఉంటే కోల్పోయిన వైభవాన్ని మళ్లీ దక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగా నోకియా మరోసారి స్మార్ట్‌ ఫోన్‌లో మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్‌ 8న ఓ ఈవెంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందులోనే 5జీ సదుపాయంతో రానున్న ‘ఎక్స్‌’, ‘జీ’ సిరీస్‌ ఫోన్లను విడుదల చేయనుంది. ఈ ఈవెంట్‌లో నోకియా ఎక్స్‌ 10, నోకియా ఎక్స్‌20 ఫోన్లను లాంచ్‌ చేయనున్నట్లు సమాచారం. ఏప్రిల్‌ 8న సాయంత్రం 7:30 గంటలకు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. వీటితో పాటు ‘జీ’ సిరీస్‌ను కూడా విడుదల చేయనున్నారు.

ఫీచర్ల విషయానికొస్తే..

నోకియ్‌ X సిరీస్‌..

* 6జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ మెమోరీ * నోకియా X10 5G ధర రూ.25,000 (అంచనా) * నోకియా X20 5G ధర రూ. 30,000 (అంచనా) * క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 480 ఎస్‌ఓసీ ప్రాసెసర్. * 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ. * 48 మెగాపిక్సెల్‌ కెమెరా, 16 మెగాపిక్సెల్‌ సెల్ఫీ.

నోకియ G సిరీస్‌..

* నోకియ G సిరీస్‌ ప్రారంభధర రూ.11,999గా ఉండనుందని సమాచారం. * ఆక్టాకార్‌ మీడియా టెక్‌ హిలియో P22 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌. * 3 జీబీ ర్యామ్‌ + (32 జీబీ, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌)

Also Read: Prabhu Deva: డ్యాన్స్‌లకు రారాజు.. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవాకు బర్త్ డే విషెస్..

వకీల్‌ సాబ్‌ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్..! రేపు సాయంత్రం 6 గంటలకు.. టీవీ9లో తప్పక చూడండి..

Raashi Khanna Dance Enjoy Enjaami: అందాల రాశీ అద్భుత డ్యాన్స్‌.. స్టెప్స్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu