AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Android Malware: ఆండ్రాయిడ్‌ యూజర్లకు పెద్ద ముప్పు.. మరో ప్రమాదకరమైన మాల్వేర్‌!

Android Malware: స్టర్నస్ మొదటి బాధితులు దక్షిణ, మధ్య ఐరోపాలో ఉన్నట్లు గుర్తించారు పరిశోధకులు. మాల్వేర్ ఇంకా అభివృద్ధి ప్రారంభ దశలోనే ఉందని చెబుతున్నారు. అయినా దాని ఎఫెక్ట్‌ ఇప్పటి నుంచే ఉందని, దాని సామర్థ్యం ఎంత ఉందనే దానిపై పరిశోధన చేస్తున్నారు చెబుతున్నారు. ఇప్పటివరకు..

Android Malware: ఆండ్రాయిడ్‌ యూజర్లకు పెద్ద ముప్పు.. మరో ప్రమాదకరమైన మాల్వేర్‌!
Subhash Goud
|

Updated on: Nov 27, 2025 | 10:01 AM

Share

New Android Malware: మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తుంటే మీకో కీలక సమాచారం ఉంది. ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఒక పెద్ద ముప్పు తలెత్తనుంది. సైబర్ సెక్యూరిటీ నివేదికల ప్రకారం, కొత్త ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ ట్రోజన్, స్టర్నస్, బ్యాంకింగ్ యాప్‌లను వేగంగా లక్ష్యంగా చేసుకుంటోంది. దీని వల్ల వినియోగదారుల లాగిన్ వివరాలను దొంగిలించే ప్రమాదం ఉంది. ఇంకా ఈ మాల్వేర్ వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ చాట్‌లను కూడా ఎటువంటి ఎన్‌క్రిప్షన్ కోడ్‌ను కూడా దొంగిలించవచ్చు. ప్రస్తుతం ఈ మాల్వేర్‌ సమస్యను పరిష్కరించడానికి గూగుల్ కొత్త భద్రతా ప్యాచ్‌ను విడుదల చేయలేదు.

బ్యాంకింగ్ యాప్‌లపై స్టర్నస్ ఎలా దాడి చేస్తుంది:

థ్రెట్ ఫాబ్రిక్ నివేదిక ప్రకారం.. MTI సెక్యూరిటీ పరిశోధకులు స్టర్నస్ అనేది బ్యాంకింగ్ యాప్‌ల మాదిరిగానే నకిలీ లాగిన్ పేజీని సృష్టించగల బ్యాంకింగ్ ట్రోజన్ అని కనుగొన్నారు. వినియోగదారు లాగిన్ వివరాలను నమోదు చేసిన వెంటనే ఈ సమాచారం నేరుగా సైబర్ నేరస్థులకు బదిలీ చేయబడుతుంది. ఈ మాల్వేర్ విస్తృతమైన రిమోట్ యాక్సెస్‌ను కలిగి ఉందని, దాడి చేసేవారు వినియోగదారు ప్రతి కార్యాచరణను ప్రత్యక్షంగా పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుందని నివేదిక పేర్కొంది. ఇంకా ఇది స్క్రీన్‌ను బ్లాక్‌అవుట్ చేయగలదు. అలాగే నేపథ్యంలో మోసపూరిత లావాదేవీలను అమలు చేయగలదు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Online Jewellery: ఆన్‌లైన్‌లో బంగారు అభరణాలు కొనుగోలు చేయడం సురక్షితమేనా? ముందు ఇవి తెలుసుకోండి!

E2E ఎన్‌క్రిప్షన్‌ను ఉల్లంఘించకుండా చాట్‌ను చదువుతుంది:

నివేదిక ప్రకారం, ఈ మాల్వేర్ ఏ ఎన్‌క్రిప్షన్ ను బ్రేక్‌డౌన్‌ చేయకుండా ఆండ్రాయిడ్ డివైజ్‌లలో సందేశాలను డీక్రిప్ట్ చేసిన వెంటనే స్క్రీన్ క్యాప్చర్ ద్వారా చదువుతుంది. ఇది వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో చాట్‌లను పర్యవేక్షించడానికి అనుమతిస్తుంది. మూడు యాప్‌లు తమ చాట్‌లను థర్డ్‌ పార్టీ యాప్‌లకు యాక్సెస్ చేయలేవని పేర్కొంటున్నాయి. కానీ స్టర్నస్ స్క్రీన్ స్థాయిలో సందేశాలను వీక్షించగలదు. ఇది తీవ్రమైన భద్రతా ముప్పును కలిగిస్తుంది.

యూరప్‌లో ముందస్తు దాడులు:

స్టర్నస్ మొదటి బాధితులు దక్షిణ, మధ్య ఐరోపాలో ఉన్నట్లు గుర్తించారు పరిశోధకులు. మాల్వేర్ ఇంకా అభివృద్ధి ప్రారంభ దశలోనే ఉందని చెబుతున్నారు. అయినా దాని ఎఫెక్ట్‌ ఇప్పటి నుంచే ఉందని, దాని సామర్థ్యం ఎంత ఉందనే దానిపై పరిశోధన చేస్తున్నారు చెబుతున్నారు. ఇప్పటివరకు కొంతమంది బాధితులను మాత్రమే గుర్తించారు. కానీ ఈ చిన్న, తరచుగా జరిగే దాడులను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో పెద్ద ఎత్తున సైబర్ దాడి జరగవచ్చని నిపుణులు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: మళ్లీ అదే జోరు.. పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!

Zodiac Sign: ఈ 3 రాశుల వారికి డిసెంబర్ నెల ఎంతో అదృష్టం.. జీవితాల్లో ఎన్నో అద్భుతాలు

Maruti Car: మారుతి ఆల్టో కంటే చౌకైగా.. కేవలం రూ.3.5 లక్షలకే సరికొత్త 5 సీట్ల కారు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి