AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auto News: కిలోమీటర్ ఖర్చు కేవలం 60పైసలే.. ఇతర కంపెనీలకు చెమటలు పట్టిస్తున్న కారు!

Auto News: అక్టోబరు నెలలో ఈ కారు సేల్స్‌లో ఏకంగా 143 శాతం వృద్ధి నమోదు చేసింది. సెప్టెంబరులో కేవలం 250 యూనిట్లు అమ్ముడవగా 2024 అక్టోబరులో 609 యూనిట్ల అమ్మకాలతో అదరగొట్టింది. టాటా నెక్సాన్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఈవీ..

Auto News: కిలోమీటర్ ఖర్చు కేవలం 60పైసలే.. ఇతర కంపెనీలకు చెమటలు పట్టిస్తున్న కారు!
Subhash Goud
|

Updated on: Nov 27, 2025 | 8:22 AM

Share

Auto News: ఇండియన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఎంజీ ZS EV కంపెనీకి ఒక లక్కీ మోడల్ అని చెప్పవచ్చు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గురించి ఎవ్వరు కూడా నెగిటివ్ మాట్లాడింది లేదు. దానికి తగ్గట్టుగానే ప్రతి నెలా దీని సేల్స్ భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అక్టోబరు నెలలో ఈ కారు సేల్స్‌లో ఏకంగా 143 శాతం వృద్ధి నమోదు చేసింది. సెప్టెంబరులో కేవలం 250 యూనిట్లు అమ్ముడవగా 2024 అక్టోబరులో 609 యూనిట్ల అమ్మకాలతో అదరగొట్టింది. టాటా నెక్సాన్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఈవీ వంటి ప్రత్యర్థులతో ఆరేళ్లుగా పోటీ పడుతోంది. ఎంజీ ZS EV. తన పవర్ఫుల్బ్యాటరీ ప్యాక్, అద్భుతమైన పనితీరుతో విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఈ ఎస్‌యూవీలో 50.3 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఉంది. సింగిల్ ఎలక్ట్రిక్ మోటారుతో జతచేసింది. ఈ పవర్‌ట్రైన్ 174 Bhp పవర్, గరిష్టంగా 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

సింగిల్ఛార్జ్పై 461 రేంజ్‌:

ఎంజీ ZS EV అతిపెద్ద హైలైట్ దాని రేంజ్. ఇది సింగిల్ ఛార్జ్‌పై 461 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. అంతేకాదండోయ్ ఇది DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. అందుకే వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ కారును నడపడానికి కేవలం ఒక కిలోమీటర్‌కు 60 పైసలు మాత్రమే ఖర్చు అవుతుందని కంపెనీ చెబుతోంది. ఎంజీ ZS EV అమ్మకాలకు దాని భద్రతా ప్రమాణాలు, ప్రీమియం ఫీచర్లే ప్రధాన బలం. ఈ కారులో ఉపయోగించిన బ్యాటరీ నీరు, ధూళి నుంచి రక్షించేలా డిజైన్ చేసినట్లు కంపెనీ చెబుతోంది. ఇది UL2580 సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ASIL-D రేటింగ్‌ను కూడా కలిగి ఉందని కంపెనీ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Gold Price Today: మళ్లీ అదే జోరు.. పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!

ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 360-డిగ్రీ కెమెరా, హిల్-డిసెంట్ కంట్రోల్, క్లైమెట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ వంటివి లభిస్తాయి. అప్‌డేట్ చేసిన i-Smart ఫీచర్‌లో FOTA (Firmware Over-The-Air) కేపబిలిటీ, పార్కింగ్ బుకింగ్ కోసం పార్క్ ప్లస్ యాప్, లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్‌లతో కూడిన నావిగేషన్ వంటి సదుపాయాలు ఉన్నాయి.

ధర ఎంత?

ఎంజీ ZS EV ఎక్స్-షోరూమ్ ధరలు రూ.16.88 లక్షల నుంచి రూ.24.93 లక్షల వరకు ఉన్నాయి. విండ్‌సర్ ఈవీ కేవలం 400 రోజుల్లోనే 50,000 యూనిట్ల అమ్మకాలతో కొత్త రికార్డు సృష్టించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా నిలిచింది.

ఇవి కూడా చదవండి:

Zodiac Sign: ఈ 3 రాశుల వారికి డిసెంబర్ నెల ఎంతో అదృష్టం.. జీవితాల్లో ఎన్నో అద్భుతాలు

Maruti Car: మారుతి ఆల్టో కంటే చౌకైగా.. కేవలం రూ.3.5 లక్షలకే సరికొత్త 5 సీట్ల కారు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి