Instagram: ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో యాడ్స్ రాకుండా కొత్త ఫీచర్! ఎలాగంటే..
ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ స్క్రోల్ చేసేటప్పుడు లేదా ఫేస్‌బుక్ ఫీడ్ చూసేటప్పుడు మధ్యలో వచ్చే యాడ్స్ విసిగిస్తున్నాయా? అయితే ఇకపై అలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే త్వరలోనే మెటా సంస్థ సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ విధానాన్ని తీసుకురాబోతుంది. ఇదెలా పని చేస్తుందంటే.

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్స్ ఇప్పుడు మార్కెటింగ్ ఛానెల్స్ లాగా మారిపోయాయి. ప్రమోషన్స్‌కు కేరాఫ్‌గా తయారయ్యాయి. అయితే కేవలం కంటెంట్ కోసం వాటిని వాడేవాళ్లు మధ్యలో వచ్చే యాడ్స్‌తో డిస్టర్బ్ అవ్వకుండా ఉండేందుకు మెటా సంస్థ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను తీసుకురాబోతుంది. అంటే యూట్యూబ్ తరహాలో కొంత చెల్లించి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే మీరు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్‌ను వాడుకోవచ్చు.
యుకెలో స్టార్ట్
త్వరలోనే యుకెలో ఈ కొత్త మెటా సబ్ స్క్రిప్షన్ ప్లాన్ అమలులోకి రానుంది. 18 ఏళ్లు పైబడిన వినియోగదారులు యాడ్స్ లేకుండా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ప్లాట్‌ఫారమ్స్ ను ఉపయోగించొచ్చు. ఫ్రీ వెర్షన్ లో ఎప్పటిలాగే యాడ్స్ వస్తాయి. ఈ కొత్త సబ స్క్రిప్షన్ ప్లాన్ నెలవారీగా ఉంటుంది. అంటే ప్రతినెలా కొంతమొత్తం చెల్లించడం ద్వారా ప్రకటనలు లేని వెర్షన్‌ను యాక్సెస్ చేస్తారు.
సబ్‌స్క్రిప్షన్ ధరలు
మెటా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధరలు నెలకు రూ. 355 నుంచి మొదలవుతున్నాయి. మొబైల్ వెర్షన్ అయితే రూ. 475, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లలో నెలకు రూ. 355 చెల్లించాలి. ఒక యూజర్ ఒక డివైజ్ లో మల్టిపుల్ అకౌంట్స్ ఉపయోగిస్తే ఎక్స్‌ట్రా అకౌం కు రూ. 357 అదనంగా చెల్లించాలి. అదే వెబ్‌సైట్‌లో అయితే రూ. 238 అదనంగా చెల్లించాలి. ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ద్వారా యూజర్స్.. ఎలాంటి యాడ్స్ లేకుండా యాప్స్ వాడుకోవచ్చు. ఫ్రీ యూజర్స్ ఎప్పటిలాగానే యాడ్స్ చూస్తూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగించవచ్చు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
