Pan Card: ఇదేమి ట్విస్ట్.. ఏఐతో ఆధార్, పాన్ కార్డు తయారీ.. చూస్తే షాకింగే
ఏఐతో ఎంత ప్రయోజనం చేకురూతుందో.. అంతే ప్రమాదం పొంచి ఉంది. గతంలో డీప్ సీక్‌తో హీరోయిన్ల ఫొటోలు మార్పింగ్ చేయడంపై అనేక ఆందోళనలు రేకెత్తాయి. తాజాగా అలాంటి ప్రమాదం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏఐతో ఫేక్ ఆధార్, పాన్ కార్డులు కూడా తయారుచేసుకునే అవకాశముంది.

AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ టెక్నాలజీ ప్రపంచాన్ని ఏలుతున్నాయి. ఛాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, గ్రోక్, డీప్‌సీక్, ఫర్‌ఫెక్సిలిటీ లాంటి ఏఐ టూల్స్ ఇప్పుడు విరివిగా నెట్టింట ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. సమాచారం అంతా ఒకేచోట ఇస్తుండటం, వర్క్ టాస్క్‌లు ఈజీగా పూర్తి చేసే వెసులుబాటు ఉండటంతో వీటికి టెక్నాలజీ మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. కొంతమంది మంచి పనుల కోసం వీటిని వాడుతుండగా.. మరికొంతమంది ఫేక్ వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి తప్పుడు పనుల కోసం వాడుతున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ టెక్కీ అచ్చం ఆధార్, పాన్‌ను పోలిన డాక్యుమెంట్స్‌ను ఏఐ ఉపయోగించి క్రియేట్ చేశాడు. ఎలాంటి అనుమానం రాకుండా అచ్చం ఆధార్, పాన్ కార్డుల్లాగే ఇవి ఉన్నాయి.
కొద్దిరోజుల క్రితం గూగుల్ జెమినీ తన ఫ్లాట్‌ఫామ్‌లో నానో బనానా మోడల్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వీడియోలు, ఫొటోలు సింపుల్‌గా క్రియేట్ చేసుకునే ఈ ఫీచర్ తెగ ట్రెండ్ అవుతోంది. బెంగళూరు చెందిన హర్వీన్ సింగ్ చద్దా అనే వ్యక్తి ఆ ఫీచర్ ఉపయోగించి ఫేక్ ఆధార్, పాన్ కార్డులు క్రియేట్ చేశాడు. వీటిని తన ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేసిన అతడు.. ‘నానో బనానా అనేది మంచి ఫీచర్. కానీ దాని వల్ల ప్రాబ్లం కూడా ఉంది. అత్యంత ఖచ్చితత్వంలో దాని ద్వారా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయవచ్చు. దీని వల్ల గుర్తింపు కార్డుల ధృవీకరణ సమయంలో ఏది ఫేక్.. ఏది ఒరిజినల్ అనేది కనిపెట్టడం కష్టమవుతుంది. ఉదాహరణల కోసం ఊహాజనిత వ్యక్తి పాన్, ఆధార్ కార్డులను షేర్ చేస్తున్నా’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.
nanobanana is good but that is also a problem. it can create fake identity cards with extremely high precision
the legacy image verification systems are doomed to fail
sharing examples of pan and aadhar card of an imaginary person pic.twitter.com/Yx5vISfweK
— Harveen Singh Chadha (@HarveenChadha) November 24, 2025
ప్రస్తుతం అతడి పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతడు షేర్ చేసిన ఫొటోలను చూస్తే.. అచ్చం ఆధార్, పాన్ కార్డు డిజైన్‌ను పోలి ఉంది. వాటిపై క్యూఆర్ కోడ్స్, నేమ్, పుట్టినతేదీ, అడ్రస్ అన్నీ ప్రింట్ చేసి ఉన్నాయి. దీంతో నానో బనానా ఫీచర్ ద్వారా ఫేక్ ఐడెండిటీ కార్డులు ఎవరైనా సృష్టించుకోవచ్చని, ఇది ప్రాదమకరమనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.




