Lenovo Tab M11: ఫ్రీస్టయిల్‌ యాప్‌తో లెనోవో కొత్త ట్యాబ్‌.. ఈ యాప్‌ ప్రత్యేకత ఏంటంటే..

ఇక లెనోఓ ట్యాబ్‌ ఎమ్‌11 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 11 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. ఈ ట్యాబ్‌ను వైఫై, ఎల్‌టీఈ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. మార్చి 26వ తేదీ నుంచి ఈ ట్యాబ్‌ సేల్ ప్రారంభం కానుంది. ఇక ఈ ట్యాబ్‌లో స్టైలస్‌ ఇన్‌పుట్‌తో తీసుకొచ్చారు. అలాగే నోట్స్‌ రాసుకోవడానికి నెబో యాప్‌ ఇన్‌బిల్ట్‌గా ఇచ్చారు. ఇక ఈ ట్యాబ్లో ప్రత్యేకంగా లెనోవో ఫ్రీస్టయిల్...

Lenovo Tab M11: ఫ్రీస్టయిల్‌ యాప్‌తో లెనోవో కొత్త ట్యాబ్‌.. ఈ యాప్‌ ప్రత్యేకత ఏంటంటే..
Lenovo Tab M11
Follow us

|

Updated on: Mar 26, 2024 | 5:18 PM

ప్రస్తుతం మార్కెట్లో ట్యాబ్‌ల హవా కొనసాగుతోంది. కొంగొత్త ఫీచర్లతో కూడిన ట్యాబ్స్‌ను మార్కెట్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్‌ను చేసుకొని ట్యాబ్స్‌ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం లెనోవో భారత్‌లోకి కొత్త ట్యాబ్‌ను విడుదల చేసింది. లెనోవో ట్యాబ్‌ ఎమ్‌11 పేరుతో ఈ ట్యాబ్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ లెనోవో ట్యాబ్‌ఎమ్‌11లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

ఇక లెనోఓ ట్యాబ్‌ ఎమ్‌11 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 11 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. ఈ ట్యాబ్‌ను వైఫై, ఎల్‌టీఈ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. మార్చి 26వ తేదీ నుంచి ఈ ట్యాబ్‌ సేల్ ప్రారంభం కానుంది. ఇక ఈ ట్యాబ్‌లో స్టైలస్‌ ఇన్‌పుట్‌తో తీసుకొచ్చారు. అలాగే నోట్స్‌ రాసుకోవడానికి నెబో యాప్‌ ఇన్‌బిల్ట్‌గా ఇచ్చారు. ఇక ఈ ట్యాబ్లో ప్రత్యేకంగా లెనోవో ఫ్రీస్టయిల్ యాప్‌ను అందించారు. ఈ యాప్‌ సహాయంతో ట్యాబ్‌ను కంప్యూటర్‌కు లేదా మరో ట్యాబ్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.

ఇక లెనోవో ట్యాబ్‌ ఎమ్‌11లో నోట్స్‌ రాసుకోవడానికి నెబో యాప్‌ ఇన్‌బిల్ట్‌గా ఇస్తున్నారు. మై స్క్రిప్ట్‌ కాలిక్యులేటర్‌ ఈ ట్యాబ్ మరో ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ ట్యాబ్‌ మీడియాటెక్‌ హీలియో జీ88 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌తో దీనిని తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ ట్యాబ్‌ పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరా, 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 10 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 7040 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. యూఎస్‌బీ టైప్‌ సి పోర్టుతో వచ్చే ఈ ట్యాబ్‌లో వైర్డ్‌ హెడ్‌సెట్‌ వినియోగించుకోవడానికి వీలుగా 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ను అందిస్తున్నారు. ధర విషయానికొస్తే సిమ్‌కార్డు సపోర్ట్ చేసే ఎల్‌టీఈ వేరియంట్‌ ధర రూ. 21,999కాగా, వైఫైకి సపోర్ట్ చేసే ట్యాబ్‌ ధర రూ. 17,999గా నిర్ణయించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు