Smartphone: వచ్చే నెలలో లాంచింగ్ కు సిద్ధమవుతోన్న కొత్త స్మార్ట్ ఫోన్స్ ఇవే.. ఓ లుక్కేయండి

మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా కొంగొత్త ఫోన్‌లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే నెలలో మార్కెట్లోకి కొన్ని కొత్త ఫోన్‌లను వస్తున్నాయి. వీటిలో కొన్ని మిడ్ రేంజ్‌ ఫోన్‌లు ఉండగా మరికొన్ని ప్రీమియం స్మార్ట్ ఫోన్‌లు ఉన్నాయి. మరి వచ్చే నెలలో లాంచింగ్‌కు సిద్ధమవుతోన్న కొన్ని స్మార్ట్‌ఫోన్‌లపై ఓ లుక్కేయండి..

Narender Vaitla

|

Updated on: Mar 26, 2024 | 9:59 PM

Samsung Galaxy M55: వచ్చే నెలలో అందుబాటులోకి వస్తున్న స్మార్ట్ ఫోన్‌లలో సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌55 స్మార్ట్ ఫోన్‌ ఒకటి. త్వరలోనే లాంచింగ్‌కు సిద్ధమైన ఈ స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌  7 జెన్ 1 ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఈ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్‌, 256 బీజీ స్టోరేజ్‌ను ఇవ్వనున్నారు. ఈ ఫోన్‌ రూ. 30 వేల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

1 / 5
Realme GT 5 Pro: చైనాకు చెందిన రియల్‌మీ రియల్‌మ్‌ జీటీ 5 ప్రో పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. ఈ ఫోన్‌లో 5400 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు. 100 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్‌ సపోర్ట్ చేయనుంది. 50 వాట్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయనుంది. ధర విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

2 / 5
OnePlus Nord CE 4: లాంచింగ్‌కు సిద్ధంగా ఉన్న వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్‌ ఒకటి. ఏప్రిల్‌ మొదటి వారంలో లాంచ్‌ చేయనుననారు. ఇందులో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఈ ఫోన్‌లో 1.5 కే రిజల్యూజన్‌తో కూడిన స్క్రీన్‌ను అందించనున్నారు. ఈ ఫోన్‌ ధర రూ. 27 వేలుగా ఉండొచ్చని అంచనా

3 / 5
Moto Edge 50 Pro: ఇక ఈ నెలలో అందుబాటులోకి వస్తున్న మరో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌లో మోటో ఎడ్జ్‌ 50 ప్రో ఒకటి. ఈ ఫోన్‌ను ఏప్రిల్‌లో లాంచ్‌ చేయనున్నారు. ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన 1.5కే రిజల్యూజన్‌ కర్వడ్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 144 హెజ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం.

4 / 5
Google Pixel 8a: గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ ఫోన్‌ను మే నెలలో లాంచ్‌ చేయనున్నారు. ఇందులో గూగుల్‌ ఏఐ ఫీచర్లను అందించనున్నారు. మోస్ట్‌ అవెయిటెడ్ స్మార్ట్ ఫోన్స్‌లో ఇదీ ఒకటి.

5 / 5
Follow us