Fire-Boltt Oracle: మార్కెట్లోకి మరో ఇంట్రెస్టింగ్ వాచ్‌.. సిమ్‌, వైఫై సపోర్ట్‌తో పాటు మరెన్నో..

ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ వాచ్‌ల హవా నడుస్తోంది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన వాచ్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి. దాదాపు స్మార్ట్‌ ఫోన్‌లలో ఉండే అన్ని ఫీచర్లతో కూడిన వాచ్‌లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఫైర్‌ బోల్ట్‌ కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. ఈ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla

|

Updated on: Mar 26, 2024 | 10:07 PM

ప్రముఖ గ్యాడ్జెట్ తయారీ సంస్థ ఫైబర్‌ బోల్ట్‌ భారత మార్కెట్లోకి కొత్త వాచ్‌ను లాంచ్‌ చేసింది. ఫైర్‌ బోల్ట్‌ ఒరాకిల్‌ పేరుతో ఈ వాచ్‌ను తీసుకొచ్చింది. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో ఈ వాచ్‌ను తీసుకొచ్చారు. ఈ వాచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

1 / 5
ఈ స్మార్ట్ వాచ్‌లో 1.96 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ స్క్రీన్‌ను అందించారు. ఇక ఇందులో 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌ను అందించారు. దీంతో ఈ వాచ్‌లో యాప్స్‌ను కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

2 / 5
ఫైర్‌ బోల్ట్‌ ఒరకల్‌ స్మార్ట్‌ వాచ్‌లో మంచి బ్యాటరీ ఇచ్చారు. ఈ వాచ్‌లో 700 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 36 గంటలపాటు నాన్‌ స్టాప్‌గా పనిచేస్తుంది.

3 / 5
ఇక సిమ్‌ సపోర్ట్‌తో పనిచేసే ఈ వాచ్‌ను 4జీ నెట్‌వర్క్‌తో పాటు వైఫైకి కూడా కనెక్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇందులో గూగుల్‌ సూట్ యాక్సెస్‌ ఫీచర్‌ను అదనంగా అందించారు.

4 / 5
అలాగే ఈ వాచ్‌లో నిరంతంరం హార్ట్‌ రేట్ మానిటరింగ్‌, ఎస్‌పీఓ2 వంటి హెల్త్‌ పీచర్లను అందంచారు. అలాగే పలు రకాల స్పోర్ట్స్‌ మోడ్స్‌ను కూడా ఇందులో అందించారు. ఇక ధర విషయానికొస్తే ఈ వాచ్‌ను రూ. 4999గా నిర్ణయించారు.

5 / 5
Follow us