AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SmartPhone: మార్కెట్‌లో నయా ఫోన్‌తో లావా హల్‌చల్.. వారే అసలు టార్గెట్..!

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వాడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలో జనాభాకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్ వాడే వారి సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. దేశంలో ఎక్కువగా ఉన్న మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు చాలా కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ లావా కూడా యువా స్టార్-2 పేరుతో మరో స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది.

SmartPhone: మార్కెట్‌లో నయా ఫోన్‌తో లావా హల్‌చల్.. వారే అసలు టార్గెట్..!
Lava Yuva Star 2
Nikhil
|

Updated on: May 08, 2025 | 5:00 PM

Share

భారతదేశంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా యువ సిరీస్ పేరుతో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లను లాంచ్ చేస్తుంది. తాజాగా ఈ సిరీస్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ యువ స్టార్-2 స్మార్ట్ ఫోన్‌ లాంచ్ చేసింది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్‌లో యునిసాక్ ప్రాసెసర్, 13 ఎంపీ ఏఐ ఎనేబుల్డ్ బ్యాక్ వెనుక కెమెరా ఆకట్టుకుంటుంది. యువ స్టార్ 2 ఆండ్రాయిడ్ 14 గో ప్లాట్‌ఫారమ్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది బ్లోట్‌వేర్ రహిత అనుభవాన్ని అందిస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్‌లో ప్రీ-ఇన్‌స్టాల్ యాప్స్ లేకుండా లావా చర్యలు తీసుకుంది. లావా యువ స్టార్ 2 4 జీబీ+ 64 జీబీ వేరియంట్‌లో మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉంది. 

లావా యువ స్టార్ 2  స్మార్ట్ ఫోన్ రేడియంట్ బ్లాక్, స్పార్కింగ్ ఐవరీ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఇప్పటికే భారతదేశంలోని ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ వన్ ఇయర్ ఆన్ సైట్ వారెంటీతో అందుబాటులో ఉంటుంది. లావా యువ స్టార్ 2 స్మార్ట్ ఫోన్ 6.75 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్ప్లేతో వస్తుంది. అలాగే ఆక్టా-కోర్ యూనిసోక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆప్టిక్స్ పరంగా యువ స్టార్-2 13 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్‌తో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఆకట్టుకుంటుంది. 

లావా యువ స్టార్ 2 ప్రీమియం గ్లోసీ బ్యాక్ డిజైన్‌‌తో ఆకట్టుకుంటుంది. అలాగే నీరు, ధూళి నిరోధకతతో వస్తుంది. అలాగే భద్రత పరంగా యువ 2 సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్‌తో కూడా వస్తుంది. కనెక్టివిటీ ఎంపికల కోసం డ్యూయల్ 4జీ సపోర్ట్‌తో పాటు బ్లూటూత్ 4.2తో వస్తుంది. అలాగే లావా యువా స్మార్ట్ ఫోన్‌ను మెమరీను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు విస్తరించుకోవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..