Jio Recharge Plans: ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన జియో.. రెండు నయా రీచార్జ్ ప్లాన్స్ లాంచ్..!
భారతదేశలో ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా టెలికం కంపెనీలు డేటా కమ్ అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్ వంటి రీచార్జ్ ప్లాన్స్ ప్రకటించడంతో చాలా మంది యువత స్మార్ట్ ఫోన్స్ వినియోగాన్ని ఇష్టపడుతున్నారు. అయితే ఇటీవల భారతదేశంలోని టెలికం కంపెనీలకు ట్రాయ్ కీలక ఆదేశాల జారీ చేసింది. దీంతో ప్రముఖ టెలికం కంపెనీ జియో తన రీచార్జ్ ప్లాన్స్‌ను సవరించింది.

ఇటీవల టెలికం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని టెలికం కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. టెలికం కంపెనీలు కాలింగ్, ఎస్ఎంఎస్‌లతో మాత్రమే చౌక రీఛార్జ్ ప్లాన్‌లను అందించాలని ఆదేశించింది. ట్రాయ్ విధించిన నిబంధనల మేరకు ప్రముఖ టెలికం కంపెనీ జియో కాలింగ్, ఎస్ఎంఎస్‌లతో మాత్రమే రెండు చౌక రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఇటీవల జియో తన వెబ్‌సైట్‌లో రెండు కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్‌లను జాబితా చేసింది. వినియోగదారులు 365 రోజుల వరకు వ్యాలిడిటీను అందించేలా రూ.1958 ప్లాన్, అలాగే 84 రోజుల వ్యాలిడిటీలతో రూ.458 ప్లాన్‌ను లాంచ్ చేసింది. జియో లాంచ్ చేసిన ఈ ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
రూ.458 ప్లాన్
జియో కొత్త రూ.458 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో యూజర్లకు అపరిమిత కాలింగ్‌తో పాటు 1000 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దీంతో పాటు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లకు కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా కాలింగ్, ఎస్ఎంఎస్ మాత్రమే ఉపయోగించే వినియోగదారుల కోసం తీసుకువచ్చారు. ఈ ప్లాన్ ద్వారా భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాల్స్, ఉచిత జాతీయ రోమింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
రూ.1958 ప్లాన్
జియో రూ. 1958 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీతో లాంచ్ చేశారు. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. దీంతో పాటు 3600 ఉచిత ఎస్ఎంఎస్‌లతో పాటు ఉచిత జాతీయ రోమింగ్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.
ఆ రెండు ప్లాన్‌ల తొలగింపు
జియో ఇప్పుడు తన పాత రీఛార్జ్ ప్లాన్‌లను రెండింటిని తొలగించింది. ఈ ప్లాన్‌లు రూ.479, రూ.1899. రూ.1899 ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో 24 జీబీ డేటాను అందించగా, రూ.479 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో 6 జీబీ డేటాను అందించేది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి