Jio Plans: అత్యంత చవకైన సూపర్ ప్లాన్ తీసుకొచ్చిన జియో.. 5జీ వాడేవారికి పండుగే..
జియో కస్టమర్లకు భారీ గుడ్‌న్యూస్. మీరు జియో 5జీ నెట్‌వర్క్ వాడుతున్నారా..? హైస్పీడ్ 5జీ నెట్‌వర్క్ డేటా తక్కువ ఖర్చుతో పొందాలనుకుంటున్నారా..? కేవలం రూ.200 కంటే తక్కువ ఖర్చుతో 5జీ డేటా పొందవచ్చు. ఆ ప్లాన్ వివరాలు ఇప్పుడు ఇందులో చూద్దాం.

తమ వినియోగదారుల కోసం జియో అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. అద్భుత ఫీచర్లతో మైమరిపించే 5జీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇటీవల అందరూ 4జీ నుంచి 5జీకి మారుతున్నారు. భారత్‌లో మారుమూల గ్రామాలకు కూడా 5జీ విస్తరిస్తోంది. నాణ్యమైన కాల్స్, హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 5జీ నెట్‌వర్క్‌కి మారుతున్నారు. దీంతో 5జీలోకి మారే కస్టమర్ల కోసం టెలికాం సంస్థలు ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెస్తోన్నాయి. తక్కువ ధరకే 5జీ ఇంటర్నెట్ అందించే ప్లాన్లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు జియో 5జీ డేటాను ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త ప్లాన్ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
జియో 199 ప్లాన్
ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ.199. ప్లాన్ వాలిడిటీ 14 రోజులు ఉంటుంది. రోజుకు 2జీబీ 5జీ నెట్‌వర్క్ డేటా అందిస్తుంది. 14 రోజుల పాటు మొత్తం 28జీబీ డేటా వాడుకునే సౌకర్యం ఉంటుంది. ఇక అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. రోజుకు 2జీబీ డేటా పరిమితి పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. ఇక జియో టీవీ, జియో క్లౌడ్ స్టోరేజ్ వంటి ప్రయోజానాలు పొందవచ్చు. 5జీ సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ వాడేవారికి ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మార్కెట్‌లో 5జీ ప్లాన్లు అధిక ధరలతో ఉన్నాయి. రూ.200 కంటే తక్కువ ధరలో 5జీ నెట్ వర్క్ డేటా వాడాలనుకునేవారికి ఇది మంచి ప్లాన్‌గా చెప్పవచ్చు.
ఎయిర్‌టెల్ 5జీ డేటా ప్లాన్
ఇక ఎయిర్‌టెల్‌లో 200 కంటే తక్కువ ధరలో 5జీ నెట్ వర్క్ డేటా ప్లాన్ లేదు. బేసిక్ ప్లాన్ రూ.349 ఎయిర్‌టెల్ కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజల పాటు ఉంటుంది. రోజుకు 1.5 జీబీ 5జీ డేటాతో పాటు ఆన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. 5జీ నెట్ వర్క్ మీ ప్రాంతంలో ఉండి మీ దగ్గర 5జీ సపోర్ట్ చేసే ఫోన్ ఉంటే ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చు.
