AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘాటైన మిరపకాయలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? తెలిస్తే అస్సలు వదలరు..!

Spicy chilies benefits: ఎండు మిరపకాయల్లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం, ఫొలేట్, పోటాషియం, థయామిన్ వంటి ముఖ్య పోషకాలు కూడా ఉన్నాయి. మినపకాయలను వంటకాల్లో వాడటం వల్ల జీవక్రియను పెంచి బరువును నియంత్రలో ఉంచుతుంది. మిరపకాయలను తీసుకోవడం కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఘాటైన మిరపకాయలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? తెలిస్తే అస్సలు వదలరు..!
Mirchi
Rajashekher G
|

Updated on: Jan 26, 2026 | 5:07 PM

Share

భారతీయ వంటకాల్లో ఎర్ర మిరిపకాయలకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు అన్ని వంటకాల్లోనూ మిరపకాయలను వాడుతారు. ముఖ్యంగా తాళింపు వేసే సమయంలో ఈ మిర్చిని వాడతారు. వంటకాలలో మిరప్పొడితోపాటు ఎండు మిరపకాయలను కూడా వాడుతారు. కొన్ని ప్రత్యేకమైన వంటకాలలో మిరపకాయలనే ఉపయోగిస్తారు. మిరపకాయలు వంటకాలకు మంచి రుచిని ఇవ్వడంతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. మిరపకాయల్లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం, ఫొలేట్, పోటాషియం, థయామిన్ వంటి ముఖ్య పోషకాలు కూడా ఉన్నాయి. మినపకాయలను వంటకాల్లో వాడటం వల్ల జీవక్రియను పెంచి బరువును నియంత్రలో ఉంచుతుంది. మిరపకాయలను తీసుకోవడం కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జీవితకాలాన్ని పెంచుతాయి

మిరపకాయలు మన జీవన ప్రమాణాన్ని పెంచుతాయని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. అంటే మిరపకాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీవిత కాలం పెరుగుతుంది. 20 ఏళ్లపాటు నెలకు ఒక ఘాటైన మిరపకాయ తిన్నవారు తమ మరణ ప్రమాదాన్ని 13 శాతం తగ్గించుకున్నారని ఒక అధ్యయనం తేల్చింది. జీవిత కాలాన్ని పెంచుతాయని నిర్ధారణ అయినప్పటికీ.. అది ఎలా సాధ్యమైందో మాత్రం తేలలేదు. గుండె జబ్బులను కూడా ఈ మిర్చి అరికడుతుంది.

క్యాన్సర్ కట్టడి

పెద్ద ప్రేగు, కాలేయం, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్నవారిలో క్యాప్సైసిన్ క్యాన్సర్ కణాలను చంపగలదని పరిశోధనలో తేలింది. ఈ సమ్మేళనం ఈ కణాలు పెరగకుండా, వ్యాప్తి చెందకుండా నిరోధించగలదు.

ఊభయకాయం నియంత్రణ

క్యాప్సై తాత్కాలిక గ్రాహక సంభావ్య వెనిలాయిడ్1 (TRPV1)ను ప్రేరేపిస్తుందని తేల్చింది. ఈ ప్రోటీన్ కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధించగలదని, ఆకలిని నియంత్రించగలదని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి. దీనిపై మరిన్ని ప్రయోగాలు జరుగనున్నాయి.

పోషకాలు పుష్కలం

క్యాపై్ససిన్‌తోపాటు ఘాటైన మిరపకాలు అనేక పోషక మూలాలు. విటమిన్లు ఎ, సి, ఇ, ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు మీ కణాలను నష్టం నుంచి కాపాడతాయి.

బ్రెయిన్ హెల్త్

ఎండు మిరపకాయల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో హిమోగ్లోబిన్ పెరిగి బ్రెయిన్‌కి రక్తప్రసరణ సరిగా జరుగుతుంది. దీంతో బ్రెయిన్ పనితీరు మెరుగవుతుంది. తగినంత రక్తం, ఆక్సిజన్ సరఫరా కావడంతో ఆల్జీమర్స్ దూరమవుతుంది. ఫలితంగా నేర్చుకోవడం, ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి మానసిక సమస్యలు దూరమవుతాయి.

కొలెస్ట్రాల్ తగ్గించి..

ఎండు మిరపకాయల్లోని మ్యాజిక్ క్యాప్సైసిన్ రక్తంలో ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. అంతేగాక, నాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

నొప్పి నివారిణి.. కంట్రోల్ బీపీ ఇక, మిరపకాయల్లోని పోటాషియం హైబీపీని బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మరోవైపు, ఎండుమిరపకాయలు శరీరంలోని నొప్పులను తగ్గిస్తాయి. ముఖ్యంగా తలనొప్పిని తగ్గించే గుణాలున్నాయి.

జలుబు, దగ్గు నివారిణి

ఎండుమిర్చిలోని యాంటీమైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముక్కు దిబ్బడను తగ్గించడంతోపాటు జలుబు, దగ్గును నివారిస్తాయి. సైనస్ వంటి ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది. ఎముకలను బలంగా చేస్తుంది.

కంటి ఆరోగ్యం

ఎండు మిరపకాయల్లో విటమిన్ ఉండటం వల్ల కంటి ఆరోగ్యం మెరగవుతుంది. క్రమం తప్పకుండా ఎండు మిర్చి ఆహారంలో తీసుకోవడం వల్ల దృష్టి సమస్యలు తగ్గుతాయి. అంతేగాక, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

అందం పెంచుతుంది..

ఎండు మిరపకాయల్లోని విటమిన్ సి.. జుట్టు, చర్మాన్ని రిపేర్ చేసి అవసరమైన ప్రోటీన్, కొల్లాజెన్‌ని నిలుపుకోవడానికి హెల్ప్ చేస్తుంది. విటమిన్ ఎ జుట్టుని హైడ్రేట్‌గా మార్చుతుంది.

బంగారం ధరలపై పిడుగులాంటి వార్త.. 2050 నాటికి తులం రూ.40 లక్షలు..?
బంగారం ధరలపై పిడుగులాంటి వార్త.. 2050 నాటికి తులం రూ.40 లక్షలు..?
ఖర్చు లేకుండా క్యాన్సర్‌కు చెక్.. మీ వంటింట్లోనే దివ్యౌషధం..
ఖర్చు లేకుండా క్యాన్సర్‌కు చెక్.. మీ వంటింట్లోనే దివ్యౌషధం..
మంచు కొండల్లో పెళ్లి.. అక్షింతలుగా హిమపాతం! వెడ్డింగ్‌ సీన్ వైరల్
మంచు కొండల్లో పెళ్లి.. అక్షింతలుగా హిమపాతం! వెడ్డింగ్‌ సీన్ వైరల్
మీ ఇంటి బాత్రూమ్ టైల్స్ మురికిగా ఉన్నాయా.. వీటితో మాయం చేయండి
మీ ఇంటి బాత్రూమ్ టైల్స్ మురికిగా ఉన్నాయా.. వీటితో మాయం చేయండి
Lucky Zodiac Signs: ఫిబ్రవరి నెలలో అదృష్టమంతా ఆ రాశుల వారిదే..!
Lucky Zodiac Signs: ఫిబ్రవరి నెలలో అదృష్టమంతా ఆ రాశుల వారిదే..!
పనిమనిషిపై అఘాయిత్యం.. ధురంధర్ నటుడు అరెస్ట్
పనిమనిషిపై అఘాయిత్యం.. ధురంధర్ నటుడు అరెస్ట్
పోలీస్ జాబ్ అంటే ప్రాణం.. గంజాయ్ ముఠాను పట్టుకునేందుకు వెళితే..
పోలీస్ జాబ్ అంటే ప్రాణం.. గంజాయ్ ముఠాను పట్టుకునేందుకు వెళితే..
బాక్సాఫీస్ కింగ్.. రూ.4 లక్షల జీతం..ఇప్పుడు..
బాక్సాఫీస్ కింగ్.. రూ.4 లక్షల జీతం..ఇప్పుడు..
వీరికి పుట్టగొడుగులు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే రిస్క్..
వీరికి పుట్టగొడుగులు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే రిస్క్..
ఘాటైన మిరపకాయలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? తెలిస్తే అస్సలు వదలరు
ఘాటైన మిరపకాయలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? తెలిస్తే అస్సలు వదలరు