AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Growth tips: మీ జట్టు ఒత్తుగా పెరగాలంటే.. ఈ అద్భుత హెయిర్ ప్యాక్ అప్లై చేయండి చాలు!

Aloe Vera Hair Pack: మారుతున్న జీవనశైలి, ఒత్తిడి వల్ల జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు సాధారణమయ్యాయి. మార్కెట్ ఉత్పత్తులు, ఖర్చుతో కూడిన చికిత్సలకు బదులుగా, సహజ పద్ధతులతో జుట్టు సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. ముఖ్యంగా, కలబంద (అలోవెరా) హెయిర్ ప్యాక్ జుట్టు పెరుగుదలకు, తేమకు, చుండ్రు నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సులభమైన ఇంటి చిట్కాతో ఒత్తుగా, ఆరోగ్యకరమైన జుట్టును తిరిగి పొందండి.

Hair Growth tips: మీ జట్టు ఒత్తుగా పెరగాలంటే.. ఈ అద్భుత హెయిర్ ప్యాక్ అప్లై చేయండి చాలు!
Healthy Hair Secrets[1]
Rajashekher G
|

Updated on: Jan 26, 2026 | 4:22 PM

Share

Aloe vera for hair: ప్రతి ఒక్కరూ అందమైన, పొడవైన, ఒత్తైన జుట్టు కావాలని కోరుకుంటారు. అందుకోసం మార్కెట్లో లభించే అనేక రకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌ను వినియోగిస్తుంటారు. అయితే, మారుతున్న జీవనశైలి, అధిక ఒత్తిడి, కాలుష్యం వంటి కారణాల వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. మరికొందరు 30-40 ఏళ్లకే బట్టతల సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో జుట్టు వచ్చేందుకు అనేక మందులు, ఇతర ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. మరికొందరు పెద్ద ఖర్చు చేసి హెయిర్ ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు. అయితే, సహజంగానే కొన్ని ప్రయత్నాల ద్వారా జుట్టును తిరిగి పొందే అవకాశం ఉంది. ఈ సమస్యలకు ఇంట్లోనే సులభంగా దొరికే పదార్థాలతో పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ‘కలబంద (అలోవెరా)’తో తయారు చేసే సహజమైన హెయిర్ ప్యాక్ జుట్టు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.

కలబంద హెయిర్ ప్యాక్ ఉపయోగించే విధానం

ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు సమానంగా అప్లై చేయాలి. గంట సేపు అలాగే ఉంచిన తర్వాత కుంకుడు కాయ లేదా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఈ విధానాన్ని అనుసరిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు.

కలబంద వల్ల కలిగే ప్రయోజనాలు

కలబందలో ఉండే అమైనో యాసిడ్స్ జుట్టు పెరుగుదలకు సహకరిస్తాయి. అలాగే, ఇది జుట్టుకు తేమను అందించి పొడిబారిన జుట్టు సమస్యను తగ్గిస్తుంది. ఆలివ్ ఆయిల్ జుట్టుకు అవసరమైన పోషణను అందించడంతో పాటు దురద, చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఈ సహజ చిట్కాను క్రమం తప్పకుండా పాటిస్తే జుట్టు రాలడం తగ్గి, జుట్టు ఒత్తుగా, సిల్కీగా మారే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రసాయనాలతో నిండిన ఉత్పత్తులకు బదులుగా, ఇలాంటి ఇంటి చిట్కాలను ప్రయత్నించడం మంచిదని సూచిస్తున్నారు.

కలబంద హెయిర్ ప్యాక్ తయారీ విధానం

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు స్పూన్ల కలబంద గుజ్జు వేసుకోవాలి. దీనికి కొద్దిగా ఆలివ్ ఆయిల్ జోడించి, రెండు నిమిషాల పాటు బాగా కలపాలి. అనంతరం కొబ్బరి నూనె వేసి మళ్లీ ఒకసారి మిశ్రమాన్ని సవ్యంగా కలిపితే హెయిర్ ప్యాక్ సిద్ధమవుతుంది. దీన్ని క్రమం తప్పకుండా వాడితే మీ జుట్టు ఒత్తుగా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

(Declaimer: ఈ వార్తలోని సమాచారం అందుబాటులోని వనరుల నుంచి సేకరించి పాఠకుల ఆసక్తి మేరకు కోసం అందించడం జరిగింది. దీనిని టీవీ9 ధృవీకరించడం జరిగింది.)

మీ జట్టు ఒత్తుగా పెరగాలంటే.. ఈ అద్భుత హెయిర్ ప్యాక్ అప్లై చేయండి
మీ జట్టు ఒత్తుగా పెరగాలంటే.. ఈ అద్భుత హెయిర్ ప్యాక్ అప్లై చేయండి
బంగారం ధర రూ.8 కోట్లకు పెరుగుతుందా.. ఈ విషయాలు తెలిస్తే ..
బంగారం ధర రూ.8 కోట్లకు పెరుగుతుందా.. ఈ విషయాలు తెలిస్తే ..
ఊరగాయ ప్రియులారా! ఈ విషయం మీకు తెలుసా? ఆరోగ్య నిపుణుల సూచన ఏంటంటే
ఊరగాయ ప్రియులారా! ఈ విషయం మీకు తెలుసా? ఆరోగ్య నిపుణుల సూచన ఏంటంటే
ఆధార్ కార్డు కొత్త యాప్.. పూర్తిగా మారనున్న నిబంధనలు..
ఆధార్ కార్డు కొత్త యాప్.. పూర్తిగా మారనున్న నిబంధనలు..
వీటిని పచ్చిగా తినకూడదని తెలుసా.. తింటే ఇక అంతే సంగతి!
వీటిని పచ్చిగా తినకూడదని తెలుసా.. తింటే ఇక అంతే సంగతి!
టీమిండియాకు బిగ్ షాక్.. మిగిలిన 3 మ్యాచ్‌ల నుంచి తెలుగబ్బాయ్ ఔట్?
టీమిండియాకు బిగ్ షాక్.. మిగిలిన 3 మ్యాచ్‌ల నుంచి తెలుగబ్బాయ్ ఔట్?
ఓటీటీలో తమిళ బ్లాక్ బస్టర్.. ఇప్పుడు తెలుగులోకి కూడా వచ్చేసింది
ఓటీటీలో తమిళ బ్లాక్ బస్టర్.. ఇప్పుడు తెలుగులోకి కూడా వచ్చేసింది
బాబోయ్‌ చిరుత.. పరుగులు తీస్తున్న రైతులు
బాబోయ్‌ చిరుత.. పరుగులు తీస్తున్న రైతులు
'ఆ అంకుల్స్ నాతో చండాలంగా ప్రవర్తించారు' హీరోయిన్ ఎమోషనల్
'ఆ అంకుల్స్ నాతో చండాలంగా ప్రవర్తించారు' హీరోయిన్ ఎమోషనల్
ఆ ఒక్క సీన్ తేడా జరిగితే చంపేసేవాళ్లు.. డైరెక్టర్ కృష్ణవంశీ..
ఆ ఒక్క సీన్ తేడా జరిగితే చంపేసేవాళ్లు.. డైరెక్టర్ కృష్ణవంశీ..