AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JBL Tour Pro 2: లెటెస్ట్ టెక్నాలజీతో ప్రపంచంలోనే తొలి టచ్ స్ర్కీన్ వైర్ లెస్ ఇయర్ బడ్స్.. సరికొత్త ఫీచర్స్ ఇవే..

ఇయర్ పోన్స్ నుంచి బ్లూటూత్, అక్కడినుంచి వైర్ లెస్ ఇయర్ బడ్స్ వరకు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్ది సరికొత్త మోడల్స్ మార్కెట్లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. ఒక్కో మోడల్ లో ఎన్నో కొత్త ఫీచర్స్ ను..

JBL Tour Pro 2: లెటెస్ట్ టెక్నాలజీతో ప్రపంచంలోనే తొలి టచ్ స్ర్కీన్ వైర్ లెస్ ఇయర్ బడ్స్.. సరికొత్త ఫీచర్స్ ఇవే..
Jbl Ear Burds
Amarnadh Daneti
|

Updated on: Sep 01, 2022 | 6:41 AM

Share

JBL Tour Pro 2: ఇయర్ పోన్స్ నుంచి బ్లూటూత్, అక్కడినుంచి వైర్ లెస్ ఇయర్ బడ్స్ వరకు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్ది సరికొత్త మోడల్స్ మార్కెట్లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. ఒక్కో మోడల్ లో ఎన్నో కొత్త ఫీచర్స్ ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి ఆడియో కంపెనీలు. అయితే ఇప్పటివరకు ప్రపంచంలోనే తొలిసారి లెటెస్ట్ టెక్నాలజీతో టచ్ స్ర్కీన్, వైర్ లెస్ ఇయర్ బడ్స్ మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి.

అమెరికాకు చెందిన ప్రముఖ ఆడియో కంపెనీ JBL ఈ సరికొత్త ఇయర్ బడ్ లను ఆవిష్కరించింది. JBL Tour Pro 2 పేరిట ఆవిష్కరించిన ఈ ఇయర్ బడ్ లలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గ్లోబల్ ఆడియో కంపెనీ JBL ప్రపంచంలోనే మొట్టమొదటి టచ్‌స్క్రీన్ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను ఆవిష్కరించింది. ఈ ట్రూ వైర్‌లెస్ స్టీరియో హెడ్‌సెట్ ఇంటిగ్రేటెడ్ డిస్‌ప్లేతో కూడిన ఒక ప్రత్యేకమైన స్మార్ట్ ఛార్జింగ్ కేస్‌ని కలిగి ఉంది. 1.45 అంగుళాల ఎల్ ఈడీ టచ్‌స్క్రీన్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించకుండానే మ్యూజిక్ ప్లే చేయటం, ఫోన్ కాల్స్ మాట్లాడటంతో పాటు మెజేజ్ లు పంపించవచ్చు. సోషల్ మీడియా నోటిఫికేషన్‌లను కూడా పొందే వెసులుబాటు ఈకొత్త టచ్ స్ర్కీన్, వైర్ లెస్ ఇయర్ బడ్స్ లో ఉన్నాయి.

యూజర్-సెంట్రిక్ ఫీచర్‌లు :సరికొత్త JBL Tour Pro 2 ఇయర్‌బడ్‌లు యాంబియంట్ సౌండ్‌కు సపోర్ట్‌ చేసే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)ని అందిస్తుంది. దీంతో యూజర్లు తాము వినాల్సిన శబ్దాలను మాత్రమే వినగలుగుతారు. బయటి నుంచి వచ్చే శబ్దాలు ఫిల్టర్ అవుతాయి. వీటిని బ్లూటూత్ 5.3 Le ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. క్రిస్టల్-క్లియర్ వాయిస్ కాల్‌ల కోసం ఆరు మైక్రోఫోన్‌లను అందిస్తోంది. మీరు కాల్ చేయవలసి వచ్చినా లేదా స్వీకరించినా ఇందులో ఇచ్చిన 6 మైక్ డిజైన్ మీ సంభాషణను సుస్పష్టంగా ఉండేలా నిర్ధారిస్తుంది. ఇంకా మరెన్నో యూజర్-సెంట్రిక్ ఫీచర్‌లను ఈ ఇయర్‌బడ్‌లలో పొందుపరిచారు.

ఇవి కూడా చదవండి

JBL Tour Pro 2 ఇయర్‌బడ్‌లను చెవికి సులభంగా అటాచ్‌మెంట్ చేయడానికి సిలికాన్ టిప్ డిజైన్ ఇచ్చారు. ఈ ఇయర్‌బడ్‌లతో మీరు 50 గంటల ప్లేటైమ్ పొందవచ్చు. ANCలో అయితే 30 గంటల పాటు వినవచ్చు. అంతేకాదు ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీతో కేవలం 10 నిమిషాలు ప్లగిన్ చేస్తే, 5 గంటల బ్యాటరీ లైఫ్ లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. Jbl Tour Pro 2 బ్లాక్, షాంపైన్ కలర్స్ లో అందుబాటులోకి రానున్నాయి. ఈసరికొత్త ఇయర్ బడ్స్ ధర రూ.20,000, వచ్చే ఏడాది జనవరి నుంచి ఇవి అంతర్జాతీయ మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..