Headphones: ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా.. ఈజాగ్రత్తలు పాటించండి.. లేదంటే వేరీ డేంజర్..

నేటి ఆధునిక యుగంలో చాలా మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఫోన్ ను కాల్స్ మాట్లాడటం కంటే ఎక్కువ అందులో ఫీచర్స్ ను ఎంజాయ్ చేస్తుంటారు మొబైల్ ప్రియులు. ఎక్కువమంది పాటలు ఆస్వాదించడానికి బయటకి సౌండ్ వస్తే..

Headphones: ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా.. ఈజాగ్రత్తలు పాటించండి.. లేదంటే వేరీ డేంజర్..
Earphones
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 01, 2022 | 8:57 AM

Headphones:: నేటి ఆధునిక యుగంలో చాలా మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఫోన్ ను కాల్స్ మాట్లాడటం కంటే ఎక్కువ అందులో ఫీచర్స్ ను ఎంజాయ్ చేస్తుంటారు మొబైల్ ప్రియులు. ఎక్కువమంది పాటలు ఆస్వాదించడానికి బయటకి సౌండ్ వస్తే ఇతరులకు అసౌకర్యంగా ఉంటుందని భావించి.. ఇయర్ ఫోన్స్ ను వాడుతుంటారు. ప్రయాణ సమయాల్లోనూ లేదా ఖాళీగా ఉన్నప్పుడు టైంపాస్ కోసం సంగీతం వింటూ కాలం గడిపేస్తాం. అయితే ఇయర్ ఫోన్స్ ను పరిమితంగా వాడితే ఎటువంటి సమస్య లేదు. అలా కాకుండా ఇయర్ ఫోన్స్ ను అధికంగా వాడుతున్నవారు ఈజాగ్రత్తలు పాటించకపోతే భవిష్యత్తులో వినికిడి సమస్యతో పాటు మరిన్ని సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1.1 బిలియన్ మందిపైగా.. ఎక్కువ సౌండ్‌తో సాంగ్స్ వినడం వల్ల వినికిడి శక్తి తగ్గే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ -Who హెచ్చరించింది. ఇయర్ ఫోన్, ఇయర్ బడ్, ఎయిర్ ప్యాడ్, బ్లూటూత్‌తో ఫోన్‌లో ఎక్కువ మాట్లాడడం.. ఎక్కువ శబ్బంతో మ్యూజిక్‌ను వినడం వల్ల అది వినికిడిపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజంతా వీటిని ఉపయోగించడం వల్ల చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందంటుంన్నారు. ఇయర్ ఫోన్‌ల వల్ల ఆరోగ్యంపై ఎటువంటి దుష్ర్పభావం చూపుతుందో తెలుసుకుందాం.

వినికిడి లోపం: ఇయర్ ఫోన్ లను ఎక్కువగా ఉపయోగిస్తే చెవులు తీవ్రంగా ప్రభావితమవుతాయి. వీటిని అధికంగా ఉపయోగిస్తే ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. చెవిలో నొప్పికి కారణమవుతుంది. క్రమంగా ఈ సమస్య పెరగవచ్చు. నొప్పి తర్వాత చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. కొందరికి తల కూడా తిరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఏకాగ్రత లోపం: ఇయర్ ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏకాగ్రత లోపిస్తోంది. ఇతరులు ఉపయోగించిన ఇయర్ ఫోన్‌లు వాడడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇది చెవులపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది.

హెడ్‌ ఫోన్స్‌ ఉఫయోగించుకోండి : ఇతరుల ఇయర్‌ ఫోన్స్‌ బదులుగా హెడ్‌ ఫోన్లు ఉపయోగించడం వల్ల పెద్దగా ఇబ్బందులు ఉండబోవంటున్నారు ఎక్స్ పర్ట్స్. చెవి మీద హెడ్‌ఫోన్లు పెట్టుకోవడం వల్ల సౌండ్‌కు కర్ణభేరి మధ్య గ్యాప్‌ ఉంటుంది. దీంతో చెవిపై పెద్దగా ప్రభావం ఉండదని చెబుతున్నారు.

పరిమితమైన సౌండ్: ఇయర్‌ ఫోన్స్‌తో ఉపయోగించేటప్పుడు సౌండ్ తక్కువగా పెట్టుకోవాలి. వాల్యుమ్ 60 డెసిబెల్స్‌ కంటే తక్కవగా ఉండేలా చూసుకోవాలి. 85 డెసిబెల్స్‌ కంటే ఎక్కువ సౌండ్‌ పెట్టుకుంటే వినికిడి లోపం రావచ్చు. ఫోన్ సెట్టింగ్‌లో వాల్యూమ్‌ను 50శాతం ఉంచుకోవాలి. దీంతో సౌండ్ పెంచే ప్రయత్నం చేస్తే వార్నింగ్ వస్తుంది. అలాంటప్పుడు మనం మన సౌండ్ ను లిమిట్ లో పెట్టుకుని సాంగ్స్ వినొచ్చు.

ఇయర్ ఫోన్స్ ను ఎక్కువుగా వాడేవారు పైన జాగ్రత్తలను తీసుకోవడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సౌండ్ ఎక్కువుగా పెట్టుకుని వింటే మాత్రం త్వరగా వినికిడి సమస్యలు వస్తాయంటున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం చూడండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!