Vivo y35: వివో నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్… రూ. 20 వేల లోపు బడ్జెట్‌లో సూపర్ ఫీచర్స్..
Vivo y35: ప్రస్తుతం పండుగల నేపథ్యంలో భారత్‌లో వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తున్నారు. చైనాకు చెందిన దిగ్గజ సంస్థలన్నీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వివో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. వివో వై35 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చారు...
Vivo y35: ప్రస్తుతం పండుగల నేపథ్యంలో భారత్‌లో వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తున్నారు. చైనాకు చెందిన దిగ్గజ సంస్థలన్నీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వివో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. వివో వై35 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చారు. వివో ఆఫ్‌లైన్ స్టోర్‌తో పాటు, ఆన్‌లైన్ వెబ్‌సైట్స్‌లోనూ ఫోన్ అందుబాటులో ఉంది. వివో వై35 ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 90 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేటుతో కూడిన 6.58 అంగుళాల ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను ఇచ్చారు.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. బ్యాటరీ విషయానికొస్తే 44 వాట్ ఫ్లాష్ చార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 18,499గా ఉంది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్‌ను సెప్టెంబర్ 30వరకు కొనుగోలు చేసే వారికి ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, కోటక్ బ్యాంక్ కార్డులపై రూ. 1000 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..