AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: గ్రూప్‌ అడ్మిన్‌ల కోసం వాట్సాప్‌ బ్రహ్మాస్త్రం.. ఈ దెబ్బతో ఫేక్‌ న్యూస్‌కి చెక్‌ పడ్డట్లే..

Whatsapp: ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌ ఏంటంటే టక్కున చెప్పే సమాధానం వాట్సాప్‌. అంతలా ఈ మెసేజింగ్ యాప్‌ యూజర్లను అట్రాక్ట్ చేసింది. నిత్యం ఏదో ఒక అప్‌డేట్‌తో యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను అందిస్తూ రోజురోజుకీ యూజర్లను...

Whatsapp: గ్రూప్‌ అడ్మిన్‌ల కోసం వాట్సాప్‌ బ్రహ్మాస్త్రం.. ఈ దెబ్బతో ఫేక్‌ న్యూస్‌కి చెక్‌ పడ్డట్లే..
Whatsapp Group Admin
Narender Vaitla
|

Updated on: Sep 01, 2022 | 6:05 PM

Share

Whatsapp: ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌ ఏంటంటే టక్కున చెప్పే సమాధానం వాట్సాప్‌. అంతలా ఈ మెసేజింగ్ యాప్‌ యూజర్లను అట్రాక్ట్ చేసింది. నిత్యం ఏదో ఒక అప్‌డేట్‌తో యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను అందిస్తూ రోజురోజుకీ యూజర్లను పెంచుకుంటూ పోతోంది. ఇదిలా ఉంటే ఎన్ని రకాల ఫీచర్లను తీసుకొచ్చినా ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తికి మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. దీంతో ప్రతీ రోజూ గ్రూప్స్‌లో ఏదో ఒక తప్పుడు వార్తకు సంబంధించిన మెసేజ్‌లు వైరల్‌ అవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తికి అడ్డుకట్టవేయడానికి వాట్సాప్‌ మరో సాలిడ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది.

ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌లు గ్రూప్‌లో ఇతరులు పోస్ట్‌ చేసే మెసేజ్‌లను డిలీట్‌ చేసే అవకాశం లభించింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్‌ గ్రూప్స్‌లో సర్క్యూలేట్ అవుతోన్న మెసేజ్‌ తప్పుడు సమాచారం అని ఒకవేళ అడ్మిన్‌ భావిస్తే దానిని ఎవరికీ కనిపించకుండా చేసే పవర్స్‌ అడ్మిన్‌కు ఇచ్చారు. గ్రూప్‌ అడ్మిన్‌ సదరు మెసేజ్‌ను సెలక్ట్‌ చేసుకొని ‘డిలీట్‌ ఫర్‌ ఆల్‌’ చేస్తే ఆ మెసేజ్‌ ఎవరికీ కనిపించకుండా డిలీట్‌ అవుతుంది.

ఇదిలా ఉంటే వాట్సాప్‌ గ్రూప్స్‌లో ఫేక్‌న్యూస్‌ వైరల్‌ అయితే దానికి అడ్మిన్‌ కూడా బాధ్యత వహించాల్సిన ఉంటుందని ఇప్పటికే చట్టం చెబుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి ఫీచర్‌ అందుబాటులోకి రావడంతో అడ్మిన్‌లకు వెసులుబాటు కల్పించినట్లైంది. గతకొన్ని రోజుల క్రితం బీటా వెర్షన్‌లో పరీక్షించిన ఈ ఫీచర్‌ను ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్‌ఆర్‌టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్‌ ఉంటుందా?
దసరా పండుగకు టీజీఎస్‌ఆర్‌టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్‌ ఉంటుందా?