ISRO: అంతరిక్షంలోకి ఈగలను పంపించనున్న ఇస్రో.. కారణం ఏంటో తెలుసా.?

డ్రోసోఫిలియో మెలనోగాస్కర్‌ అనే జాతికి చెందిన ఈగలను గగన్‌యాన్‌లో భాగం చేయనున్నారు. ఇందులో భాగంగా 10 ఆడ. 10 మగ ఈగలను అంతరిక్షంలోకి పంపించనున్నారు. ఇంతకీ ఈ ఈగలే ఎందుకు ఎంపిక చేసుకున్నట్లు. అసలు ఈగల ద్వారా పరిశోధకులు ఏం తెలుసుకోనున్నారు. లాంటి ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ISRO: అంతరిక్షంలోకి ఈగలను పంపించనున్న ఇస్రో.. కారణం ఏంటో తెలుసా.?
Fruit Fly
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 26, 2024 | 7:04 AM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. గగన్‌యాన్‌ పేరుతో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 2025లో నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తి అయ్యింది. కాగా అంతరిక్షంలో మనుషులకు ఎదురయ్యే అనారోగ్య సమస్యలను పరిశీలించేందుకు గాను ఇస్రో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యోమగామలుతో పాటు ఈగలను కూడా అంతరిక్షంలోకి పంపేందు సిద్ధమైంది.

డ్రోసోఫిలియో మెలనోగాస్కర్‌ అనే జాతికి చెందిన ఈగలను గగన్‌యాన్‌లో భాగం చేయనున్నారు. ఇందులో భాగంగా 10 ఆడ. 10 మగ ఈగలను అంతరిక్షంలోకి పంపించనున్నారు. ఇంతకీ ఈ ఈగలే ఎందుకు ఎంపిక చేసుకున్నట్లు. అసలు ఈగల ద్వారా పరిశోధకులు ఏం తెలుసుకోనున్నారు. లాంటి ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

అంతరిక్షంలోకి ఈ జాతి ఈగలను పంపించేందుకు ప్రధాన కారణం వీటి విసర్జన వ్యవస్థ మానవుని విసర్జన వ్యవస్థతో దాదాపు 77శాతం పోలి ఉండడమే. అంతరిక్షంలో వ్యోమగాలు ఎక్కువగా ఘన రూపంలో ఉండే ఆహారాన్నే తీసుకుంటారు. అలాగే విటమిన్‌ డీ లభించకపోవడంతో వారు క్షీణత ఎక్కువగా ఉంటుంది. ఈ కారణాల వల్ల వారి శరీరం నుంచి కాల్షియం అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీంతో మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువవుతాయి.

ఈ విషయాలపై లోతైన పరిశోధన చేపట్టేందుకే ఈగలను పంపిస్తున్నారు. ప్రయోగంలో భాగంగా ఈగలకు కూడా సోడియం, ఇథైల్‌ గ్లైకోల్, హైడ్రాక్సీ ప్రొలైన్లు అధికంగా ఉండే పిండి, బెల్లంతో తయారు చేసిన ద్రవాన్ని ఆహారంగా ఇస్తారు. ఈ కారణంగా ఈగల్లోనూ రాళ్లు ఏర్పడుతాయి. భూమి పైకి తిరిగి వచ్చిన తర్వాత వాటి రాళ్లను అధ్యయనం చేస్తారు. దీంతో ఆస్ట్రోనాట్స్‌ ఆరోగ్యంపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. ఏడు రోజుల అంతరిక్ష ప్రయాణంలో ఈగల సంతానోత్పత్తికీ అవకాశం ఉండటంతో ఆ సంతానంపైనా అధ్యయనం చేయనున్నారు.

ఇక ఈగల కోసం ప్రత్యేకంగా ఓ కిట్‌ను సైతం పరిశోధకులు రూపొందించారు. ఇందుకోసం దేశంలోని 75 వ్యవసాయ విశ్వవిద్యాలయాలను కిట్ రూపొందించమని కోరారు. వీటిలో కర్ణాటకలోని ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయ కీటకశాస్త్ర విభాగం తయారు చేసిన డిజైన్‌ ఎంపికైంది. దీనికి సంబంధించిన హార్డ్‌వేర్‌ వ్యవస్థలను కేరళలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఎస్‌ఎస్‌టీ) తయారు చేసింది. ఫ్రూట్‌ ఫ్లై హ్యాబిటేట్‌గా దీనికి నామకరణం చేశారు. సుమారు రెండేళ్ల పాటు పరిశోధన చేసి ఈ కిట్‌ను రూపొందించారు.

మరిన్ని సైన్స్ వార్తల కోసం క్లిక్ చేయండి..