E commerce: 7 నిమిషాల్లోనే ల్యాప్‌టాప్ డెలివరీ.. వైరల్ అవుతోన్న కస్టమర్ పోస్ట్
కాగా బ్లింక్‌ఇట్, జెప్టో వంటి సంస్థలు నిత్యవసర వస్తువులను 10 నిమిషాల్లో డెలివరీ చేస్తున్నాయి. ఇలాంటి క్విక్ కామర్స్‌కు ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తోంది. మంచి నూనె మొదలు ఉల్లిగడ్డ వరకు ఆర్డర్ చేసిన క్షణాల్లో ఇంటికి వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ క్విక్ కామర్స్ రంగంలోకి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా వచ్చి చేరింది...
ఒకప్పుడు మొబైల్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ లాంటి ఏదైనా గ్యాడ్జెట్ కొనాలి అంటే ఒక నాలుగు షోరూమ్స్‌కు వెళ్లి అన్నింటినీ పరిశీలించి ఏది తీసుకోవాలో డిసైడ్ అయ్యి కొనుగోలు చేసేవాళ్లం. కానీ ఈ కామర్స్ విస్తృతి పెరిగిన తర్వాత నట్టింటికే నచ్చిన ప్రొడక్ట్స్ వచ్చేస్తున్నాయి. ఇక అమెజాన్ ప్రైమ్ సేవలతో బుక్ చేసిన ఒక్కరోజులోనే ప్రొడక్ట్స్ డెలివరీ అయ్యే వెసులుబాటు లభించింది.
కాగా బ్లింక్‌ఇట్, జెప్టో వంటి సంస్థలు నిత్యవసర వస్తువులను 10 నిమిషాల్లో డెలివరీ చేస్తున్నాయి. ఇలాంటి క్విక్ కామర్స్‌కు ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తోంది. మంచి నూనె మొదలు ఉల్లిగడ్డ వరకు ఆర్డర్ చేసిన క్షణాల్లో ఇంటికి వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ క్విక్ కామర్స్ రంగంలోకి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా వచ్చి చేరింది. ఆర్డర్ చేసిన క్షణాల్లోనే ఎలాంటి వస్తువునైనా సరే డెలివరీ చేస్తున్నారు.
ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ పేరుతో ఈ సరికొత్త సేవలను పరిచయం చేశారు. దీంతో కేవలం నిత్యవసరలే కాకుండా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను సైతం క్షణాల్లో డెలివరీ చేస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఈ సేవలకు అందుబాటులోకి రాగా.. ఓ కస్టమర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ ద్వారా ల్యాప్‌ట్యాప్ బుక్ చేసుకోగా కేవలం 7 నిమిషాల్లోనే డెలివరీ కావడం విశేషం.
Just ordered a laptop from @Flipkart minutes. 7 minutes delivery.
Will keep this thread posted.
— Sunny R Gupta (@sunnykgupta) August 22, 2024
బుక్ చేసుకున్నప్పటి నుంచి డెలివరీ అయ్యేవరకు పట్టిన సమయం 13 నిముషాలు మాత్రమే. సన్నీ గుప్తా అనే వ్యక్తి ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాప్‌టాప్‌ను బుక్ చేసుకున్నాడు. ప్రిడేటర్ ల్యాప్‌టాప్‌ను బుక్ చేసుకోగా కేవలం 7 నిమిషాల్లోనే ఇంటికి డెలివరీ అయ్యింది. ఈ విషయాలను అన్నింటినీ వివరిస్తూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశాడు. డెలివరీ బాయ్ ల్యాప్‌టాప్‌ను తీసుకొస్తున్న వీడియోను సైతం పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇది కదా అసలై డిజిటల్ భారతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..