AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart Phone: ఆ మోటరోలా ఫోన్‌కు పోటీగా ఐక్యూ ఫోన్.. ప్రధాన తేడాలివే..!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఐక్యూ తన నియో-10 మే 26న మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో లాంచ్ చేయనుందని ప్రకటించింది. ఈ కంపెనీ ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌ను టీజ్ చేయడం ప్రారంభించింది. ఈ ఫోన్ అనేక మోడళ్లతో పోటీ పడుతూ రూ.35000 లోపు లాంచ్ అవుతుందని వెల్లడైంది. ముఖ్యం ఈ స్మార్ట్ ఫోన్ మోటరోలా ఎడ్జ్ 60 స్మార్ట్ ఫోన్‌కు గట్టి పోటీనిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ఫోన్ల మధ్య ప్రధాన తేడాల గురించి తెలుసుకుందాం.

Smart Phone: ఆ మోటరోలా ఫోన్‌కు పోటీగా ఐక్యూ ఫోన్.. ప్రధాన తేడాలివే..!
Iqoo Neo 10 Vs Motorola Edge 60 Pro
Nikhil
|

Updated on: May 14, 2025 | 5:00 PM

Share

ఐక్యూ నియో 10 రెండు కలర్ వేరియంట్లలో ఆవిష్కరించారు. టైటానియం క్రోమ్, ఇన్ఫెర్నో రెడ్ కలర్స్‌లో ఈ ఫోన్ ప్రీమియం లుక్ ఆకట్టుకుంటుంది. అయితే రెడ్ వేరియంట్‌ డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌ను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుందో? అధికారికంగా వెల్లడించలేదు. మోటరోలా ఎడ్జ్ 60 ప్రో విషయానికి వస్తే ఈ ఫోన్ క్లాసిక్ వీగన్ లెదర్ ఫినిష్‌తో వస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ చాలా స్లిమ్‌గా ఉంటుంది. అలాగే ఐపీ 68, ఐపీ69 రక్షణను అందిస్తుంది. డిస్‌ప్లే విషయానికొస్తే ఐక్యూ నియో 10 1.5 కే రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో ఆకర్షిస్తుంది. గేమింగ్ కోసం ఈ ఫోన్ 144 ఎఫ్‌పీఎస్‌కు  మద్దతు ఇస్తుంది. అయితే మోటరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల కర్వ్డ్ పీ-ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. అందువల్ల కొనుగోలుదారులు ఫ్లాట్ లేదా కర్వ్డ్ డిస్‌ప్లే మధ్య ఎంచుకోవాల్సి ఉంటుంది. 

ఐక్యూ నియో 10లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో సోనీ లైట్-600 సెన్సార్‌తో 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరాతో ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకతగా ఉంది. అయితే మోటరోలా ఎడ్జ్ 60 ప్రోలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 ఎంపీ ప్రధాన కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 10 ఎంపీ టెలిఫోటో లెన్స్, 50 ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంటాయి. అందువల్ల మోటరలో ఫోన్ టెలిఫోటో లెన్స్‌తో పాటు పోటీ ప్రధాన కెమెరాతో మరింత ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

ఐక్యూ నియో 10 స్నాప్‌డ్రాగన్ 8 ఎస్ జెన్-4 సూపర్‌కంప్యూటింగ్ చిప్ క్యూ1 ప్రాసెసర్‌ల ద్వారా శక్తిని పొందుతుంది. అందువల్ల ఈ స్మార్ట్‌ఫోన్ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ అల్ట్రా ర్యామ్, యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్‌తో జత చేసిన డ్యూయల్ ప్రాసెసర్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. మరోవైపు మోటరోలా ఎడ్జ్ 60 ప్రో 12 జీబీ వరకు ర్యామ్‌తో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌పై ఆధారంగా పని చేస్తుంది. పనితీరు పరంగా ఐక్యూ నియో 10 కొత్త తరం శక్తివంతమైన చిప్‌తో పైచేయి సాధించవచ్చు. శాశ్వత పనితీరు కోసం ఐక్యూ నియో 10 120 వాట్ష్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. అయితే ఎడ్జ్ 60 ప్రో 90 వాట్స్ టర్బో ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో మద్దతు ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!