AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV Cars: మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్‌..త్వరలో లాంచ్‌ కాబోయే ఈవీ కార్లు ఇవే..!

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్‌ అమాంతం పెరుగుతుంది. చాలా దేశాల్లో క్రూడ్‌ ఆయిల్‌ వినియోగాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ఈవీ వాహనాలపై ప్రత్యేక సబ్సిడీలను అందిస్తున్నాయి. అయితే ఈవీ వాహనాల్లో స్కూటర్లు ఎక్కువ ప్రజాదరణ పొందినా ఇటీవల కాలంలో ఈవీ కార్ల కొనుగోలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025లో భారత్‌లో లాంచ్‌ కాబోయే కార్ల గురించి కీలక విషయాలను తెలుసుకుందాం.

EV Cars: మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్‌..త్వరలో లాంచ్‌ కాబోయే ఈవీ కార్లు ఇవే..!
Ev Cars
Nikhil
|

Updated on: May 14, 2025 | 12:15 PM

Share

ఎలక్ట్రిక్ వాహనాల విభాగం రోజురోజుకూ వృద్ధి చెందుతుంది. అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థలన్నీ ఐసీఈ నుంచి నుండి ఈవీ వాహనాలవైపు వేగంగా మారుతున్నారు. కియా, మహీంద్రా, మారుతి సుజుకి, టాటా ఎంజీ వంటి కంపెనీలు కొత్త కార్లను లాంచ్‌ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రిలీజవ్వబోయే ఈవీ వార్ల గురించి తెలుసుకుందాం. 

కియా క్లావిస్ ఈవీ

కియా క్లావిస్ ఈవీ త్వరలో లాంచ్‌ కానుంది. కియా కంపెనీ ఇప్పటికే ఈ మోడల్‌ ఇంధన వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఈ మోడల్‌లో భవిష్యత్‌లో ఈవీ వెర్షన్‌ లాంచ్‌ కానుందని నిపుణులు చెబుతన్నారు. ఈ మోడల్ హాట్ సెల్లింగ్ ఉత్పత్తిగా ఉంది. క్రెటా ఎలక్ట్రిక్ నుండి చాలా కీలకమైన హార్డ్‌వేర్‌ను తీసుకుంటుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి మోడల్‌ రెండు బ్యాటరీ కాన్ఫిగరేషన్‌లలో అందించే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. 

ఎంజీ ఎం9

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రదర్శించిన జేఎస్‌డబ్ల్యూ ఎంజీ ఎం9ని భారత మార్కెట్‌కు త్వరలో తీసుకురానుంది. ఎంజీ ప్రీమియం శ్రేణిలో ఉన్న ఈ కారు 90 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. అలాగే ఈ కారును ఓ సారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 430 కి.మీ. మైలేజ్‌ అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ 

మహీంద్రా కంపెనీ ఎక్స్‌యూవీ 3 ఎక్స్‌ఓ కారును ఈవీ వెర్షనలో త్వరలో లాంచ్‌ చేయనుంది. ఈ కారు 2025 చివర్లో మార్కెట్‌లో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ లాంచ్ గురించి కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అధికారికంగా లాంచ్ అయిన తర్వాత, ఈ మోడల్ టాటా పంచ్ ఈవీకు నేరుగా పోటీగా ఉంటుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

టాటా హారియర్ ఈవీ

2025 బీఎంజీఈ సమయంలో టాటా కంపెనీ హారియర్ ఈవీను ప్రదర్శించింది. టాటా కంపెనీ ఈ కారుకు సంబంధించిన అన్ని పరీక్షలను దాదాపు పూర్తి చేసిందని, త్వరలోనే హారియర్ ఈవీ మార్కెట్‌ను పలుకరించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 ముగిసేలోపు ఈ కారు మార్కెట్‌లో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?