iQOO 15: ఈ ఫోన్ ఎంత వాడినా హీట్ ఎక్కదు! ఐక్యూ నుంచి నెక్స్ట్ లెవల్ స్మార్ట్ ఫోన్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఐక్యూ రీసెంట్ గా తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐక్యూ 15 ( iQOO 15)ను అఫీషియల్ గా లాంచ్ చేసింది. ఈ మొబైల్ లో మెరుగైన ప్రాసెసర్ తో పాటు అడ్వాన్స్ డ్ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు ఈ మొబైల్ లేటెస్ట్ కూలింగ్ ఛాంబర్ సెటప్ తో వస్తుంది. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

ఐక్యూ 15 (iQOO 15) రీసెంట్ గానే చైనాలో అఫీషియల్ గా లాంచ్ అయింది. మరో నెలలో ఇండియాకు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఈ మొబైల్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు మొబైల లవర్స్ ను తెగ ఊరిస్తున్నాయి. ఇది ఐక్యూ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్ షిప్ ఫోన్. ఇందులో ప్రాసెసర్, కెమెరా, డిస్ ప్లే, స్టోరేజ్.. ఇలా అన్ని విభాగాల్లో ఈ మొబైల్ అప్ డేటెడ్ గా ఉండనుంది.
ఫీచర్లు..
ఐక్యూ 15 మొబైల్ 6.85 ఇంచ్ అమోలెడ్ 2కె ప్యానెల్ డిస్ ప్లేతో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో HDR10+ సపోర్ట్, డాల్బీ విజన్ సపోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి. ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ పై పని చేస్తుంది. ఇందులో లేటెస్ట్ అల్ట్రా ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ సపోర్ట్ ఉంది. వీటితోపాటు ఈ ఫోన్ లో కూలింగ్ కోసం 14,000mm² వాపర్ ఛాంబర్ ఏర్పాటు చేయబడింది. దీని వలన ఫోన్ ఎంత వాడినా హీట్ ఎక్కకుండా ఉంటుంది. గేమ్స్, వీడియో కాల్స్ ఎక్కువగా వాడేవాళ్లకు ఈ ఫీచర్ యూజ్ ఫుల్ గా ఉంటుంది.
కెమెరా
ఇక కెమెరాల విషయానికొస్తే.. ఇందులో మూడు 50 ఎంపీ కెమెరాలుంటాయి. 50MP ప్రైమరీ సెన్సార్ తో పాటు మరో 50MP టెలిఫోటో లెన్స్ అలాగే మరో 50MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉంటాయి. ముందువైపు 32MP సేల్ఫీ కెమెరా ఉంటుంది. ఇక ధరల విషయానికొస్తే.. ఐక్యూ 15 (12GB + 256GB) ధర సుమారు రూ.51,890 ఉండొచ్చు. 16GB + 512GB మోడల్ ధర సుమారు రూ.61,772 ఉండొచ్చు. ఈ ఫోన్ ముఖ్యంగా ఫోటోగ్రఫీ, గేమింగ్, హెవీ యూజ్, కంటెంట్ స్ట్రీమింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది అని తెలుస్తుంది. ఇండియాలో ఈ మొబైల్ కు మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




