AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp Feature: వాట్సాప్‌లో కొత్త ఫీఛర్! ఇకపై ఎక్కువ మెసేజ్‌లు పంపలేరు!

ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీఛర్లను యూజర్లకు అందుబాటులోకి తెస్తుంటుంది. అందులో భాగంగానే మెసేజ్ లిమిట్ అనే కొత్త ఫీచర్ ను తీసుకురాబోతుంది. ఈ ఫీచర్ తో యూజర్లు రెండు ముఖ్యమైన బెనిఫిట్స్ పొందొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Whatsapp Feature: వాట్సాప్‌లో కొత్త ఫీఛర్! ఇకపై ఎక్కువ మెసేజ్‌లు పంపలేరు!
Whatsapp Feature
Nikhil
|

Updated on: Oct 22, 2025 | 12:34 PM

Share

మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను చాలామంది డైలీ లైఫ్ లో భాగంగా వాడుతుంటారు. అయితే చాలామందికి వాట్సాప్ లో స్పామ్ మెసేజ్ లు విసిగిస్తుంటాయి. కొన్నసార్లు మార్కెటింగ్ వాళ్లు కూడా అదే పనిగా మెసేజ్ చేసి విసిగిస్తుంటారు. అయితే వాట్సాప్ తీసుకొచ్చిన ఈ ఫీఛర్ తో ఇకపై ఇలాంటి సమస్యలు తగ్గనున్నాయి. అదెలాగంటే.

మెసేజ్ లిమిట్

వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త మెసేజ్ లిమిట్ ఫీచర్ సాయంతో తెలియని వ్యక్తుల నుంచి ఎక్కువ మెసేజ్ లు రావు. పరిచయం లేని వ్యక్తులకు పంపే మెసేజ్‌లపై వాట్సాప్ లిమిట్ పెట్టింది. అంటే కొత్తవారికి  మెసేజ్‌ పంపితే దానికి అటు నుంచి రిప్లై రాకపోతే ఇకపై వారికి మెసేజ్ పంపలేరు. కొత్త వారు పంపే మెసేజ్ లను లెక్కించి లిమిట్ దాటితే ఇక మెసేజ్ పంపలేని విధంగా ఈ కొత్త ఫీఛర్ అందుబాటులోకి రానుంది. అయితే మెసేజ్ ల లిమిట్ ఎంత ఉంటుంది అన్నంది వాట్సాప్‌ ఇంకా వెల్లడించలేదు. ఒక నెలలో రిప్లై రాని కొత్త మెసేజ్‌లు లిమిట్ చేరుకోగానే యూజర్లకు పాప్-అప్ రూపంలో హెచ్చరిక కనిపిస్తుంది. ఇకనుంచి ఆ నెంబర్ కు వాళ్లు మెసేజ్ లు పంపలేరు.

ఇవి కూడా..

వాట్సాప్ తీసుకొస్తున్న ఈ ఫీచర్ వల్ల రెండు ఉపయోగాలుంటాయి. ముఖ్యంగా బిజినెస్ మెసేజ్ లు, ప్రమోషనస్ మెసేజ్ ల వంటివి బాగా తగ్గుతాయి. ఇక రెండో ఉపయోగం.. అదేపనిగా మెసేజ్ లు పెట్టి విసిగించే వాళ్లకు అడ్డుకట్టగా ఈ ఫీచర్ నిలుస్తుంది. మీకు ఇష్టం లేకపోయినా మెసేజ్ చేసే విసిగించే వాళ్లు ఉన్నప్పుడు ఈ ఫీచర్ ద్వారా వాళ్లకు కూడ అడ్డుకట్ట పడుతుంది. ఈ ఫీచర్ ద్వారా మీకు వేరే వాళ్లు ఎక్కువ మెసేజ్ లు పంపలేరు. అదేవిధంగా అటు నుంచి రిప్లై రాకుండా మీరు కూడా వేరేవాళ్లకు ఎక్కువ మెసేజ్ లు పంపలేరు.  వాట్సాప్ లో ఇప్పటికే ఫార్వార్డ్ మెసేజెస్ పై లిమిట్ ఉంది. ఈ కొత్త ఫీచర్  కూడా అదే తరహా మెసేజ్ లను కంట్రోల్ చేస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశంఉ ఉంది. ఇక దీంతోపాటు వాట్సాప్ మరో ఫీచర్ ను కూడా పరీక్షిస్తోంది. స్టేటస్ అప్‌డేట్స్ లో ఇన్ స్టాగ్రామ్ ను ఇంటిగ్రేట్ చేసే అవకాశాన్ని వాట్సాప్ అందించబోతోంది. అలాగే వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ ల్లో సరికొత్త ఏఐ AI ఫీచర్లపై కూడా మెటా ఆలొచిస్తున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

రైలులో ట్రాన్స్‌జెండర్‌ ముందు ఏడ్చిన యువకుడు..ఆమె చేసిన పనికి..
రైలులో ట్రాన్స్‌జెండర్‌ ముందు ఏడ్చిన యువకుడు..ఆమె చేసిన పనికి..
Chanakya Niti: ఈ రెండు గుణాలుంటే మీరు జీవితంలో ఓడిపోరు!
Chanakya Niti: ఈ రెండు గుణాలుంటే మీరు జీవితంలో ఓడిపోరు!
వీరికి నిమ్మకాయ విషంతో సమానం.. దూరం పెట్టకపోతే నేరుగా అక్కడికే..
వీరికి నిమ్మకాయ విషంతో సమానం.. దూరం పెట్టకపోతే నేరుగా అక్కడికే..
సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిగా చేయొచ్చు..!
సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిగా చేయొచ్చు..!
ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..
ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..
అచ్చ తెలుగమ్మాయి.. హీరోయిన్ మెటీరియల్ బాసూ.. ఎవరంటే..
అచ్చ తెలుగమ్మాయి.. హీరోయిన్ మెటీరియల్ బాసూ.. ఎవరంటే..
ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?
ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?