Diamond price: వజ్రం ధర ఎంత ఉంటుందో తెలుసా? బంగారం కంటే ఎంత ఎక్కువంటే..
ప్రస్తుతం ఎక్కడ చూసినా బంగారం, వెండి ధరల గురించే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో బంగారం కంటే విలువైన వజ్రాలపై కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు? అసలు వజ్రాల ధరలు ఎలా ఉంటాయి? వీటిని కూడా బంగారం లాగా ఇన్వెస్ట్ మెంట్ రూపంలో దాచుకోవచ్చా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బంగారం, వెండి లాగానే వజ్రాలకు కూడా ప్రపంచవ్యాప్తంగా వాల్యూ ఉంటుంది. అరుదైన ఆస్తి సంపదగా వజ్రాలను భావించొచ్చు. ఆభరణాల రూపంలోనే కాక ఆస్తి రూపంలో కూడా వజ్రాలు కొనుగోలు చేసేవాళ్లు చాలామందే ఉంటారు. అయితే వజ్రాల ధర బంగారం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. వజ్రాలు కూడా ఇన్వెస్ట్ మెంట్స్ కింద పనికొస్తాయి. అయితే ఇందులో కొన్ని ఇబ్బందులున్నాయి. అవేంటంటే..
వజ్రం ధరలు ఇలా..
వజ్రం అనేది ఒక అరుదైన రాయి. ఇది భూమిలో లభిస్తుంది. దీని నాణ్యతను క్యారట్ లలో కొలుస్తారు. ఒక క్యారెట్ 200 మిల్లీగ్రాములకు సమానం. దీని ధర బంగారం ధర కంటే ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది. ప్రస్తుతం ఒక క్యారట్ వజ్రం ధర సుమారు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ ఉంది. వజ్రం స్వచ్ఛత, నాణ్యత, రంగుని బట్టి ధర నిర్ణయించబడుతుంది. వజ్రాల ధరలు కూడా ప్రపంచ పరిస్థితుల వల్ల ప్రభావితమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన వజ్రాల కంపెనీలు సరఫరాను నియంత్రిస్తాయి. ఆ కారణంగా మార్కెట్ ధరలు ప్రభావితమవుతాయి.
పెట్టుబడి పెట్టొచ్చా?
బంగారం లాగా వజ్రాలకు ఒక నిర్థిష్టమైన మార్కెట్, కంట్రోలింగ్ వ్యవస్థ వంటివి లేవు. కాబట్టి ఇవి పెట్టుబడిగా అంత మంచివి కావు. డైమండ్స్ చాలా ఖరీదైనవి అయినప్పటికీ వీటిని ఇన్వెస్ట్ మెంట్స్ రూపంలో దాచుకునేందుకు సరైన వ్యవస్థ లేదు. కాబట్టి వీటిని ఆభరణాలుగా కొనుక్కోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడులు పెట్టాలంటే ఒక నిర్ణీతమైన మార్కెట్ వ్యవస్థ, ధరల నియంత్రణ వంటివి ఉండాలి. వజ్రాల విషయంలో అలాంటి వ్యవస్థ లేదు. కాబట్టి వీటిని సాంప్రదాయ పెట్టబడులుగా చూడలేము.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




