Apple iOS 15: ఐఫోన్‌ యూజర్లకు అదిరిపోయే శుభవార్త.. ఆ అప్‌డేట్‌ వచ్చేసింది.. ఆసక్తికరమైన ఫీచర్స్‌ ఇవే..!

Apple iOS 15:ఎప్పుడెప్పుడా అని ఎదరు చూసిన ఐఫోన్‌ 13 సిరీస్‌ను మార్కెట్లో విడుదలైన విషయం తెలిసిందే. దీంతో యాపిల్‌ సంస్థ తన పాత కస్టమర్లకు శుభవార్త..

Apple iOS 15: ఐఫోన్‌ యూజర్లకు అదిరిపోయే శుభవార్త.. ఆ అప్‌డేట్‌ వచ్చేసింది.. ఆసక్తికరమైన ఫీచర్స్‌ ఇవే..!
Follow us
Subhash Goud

|

Updated on: Sep 20, 2021 | 4:44 PM

Apple iOS 15:ఎప్పుడెప్పుడా అని ఎదరు చూసిన ఐఫోన్‌ 13 సిరీస్‌ను మార్కెట్లో విడుదలైన విషయం తెలిసిందే. దీంతో యాపిల్‌ సంస్థ తన పాత కస్టమర్లకు శుభవార్త అందించింది. ఫోన్‌ పనితీరుని మరింతగా మెరుగు పరిచే అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఐఫోన్‌ యూజర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఓఎస్‌ 15 అప్‌డేట్‌ని యాపిల్‌ విడుదల చేసింది. సెప్టెంబరు 20 రాత్రి 10.30 నుంఇచ యూజర్లు తమ డివైజ్‌లలో ఈ కొత్త ఐఓఎస్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన వరల్డ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌లో ఐఓఎస్‌ 15కి సంబంధించిన వివరాలను యాపిల్‌ వెల్లడించింది. అప్పటి నుంచి అప్‌డేట్‌ కోసం యాపిల్‌ యూజర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యాపిల్‌ యూజర్లకు చివరి సారిగా 14.8 అప్‌డేట్‌ అందింది. తాజాగా వచ్చిన ఐఓఎస్‌ 15 అప్‌డేట్‌తో ఫోన్‌ పనితీరులో మరింత మెరుగు అవుతుందని యాపిల్‌ వెల్లడించింది. ముఖ్యంగా కనెక్టివిటీ, ఫోకస్‌, ఎక్స్‌ప్లోర్‌ విభాగంలో అప్‌డేట్‌ బాగా పని చేస్తుందని యాపిల్‌ చెబుతోంది. ఐఫోన్‌ ఎస్‌ఈ మోడల్‌ తర్వాత మార్కెట్‌లోకి వచ్చిన 6, 7, 8 సిరీస్‌లతో పాటు ఎక్స్‌ఆర్‌ సిరీస్‌, 11, 12 , 13 సిరీస్‌ మోడల్స్‌కి ఈ అప్‌డేట్‌ అందిస్తోంది. సెప్టెంబరు 20 ఉదయం 10:30 గంటల నుంచి ఈ అప్‌డేట్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించింది.

ఐఓఎస్‌ 15లో ఏయే ఫీచర్స్‌..

► ఐఓఎస్‌ 15 ఓఎస్‌ ఏయే డివైజ్‌లను సపోర్ట్ చేస్తుందనే దానికి సంబంధించి యాపిల్ జాబితా విడుదల చేసింది. యాపిల్ కొత్తగా తీసుకొస్తున్న ఈ ఓఎస్‌లో ఫేస్‌టైమ్‌ ఫీచర్‌ను తీసుకొస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్, పీసీ యూజర్స్‌ కూడా పాల్గొనవచ్చు. ఐమెసేజెస్‌లో కూడా కీలక మార్పులు చేసింది. ఇతరుల నుంచి వచ్చే ఐమెసేజెస్‌లోని లింక్‌లు, ఫొటోలను సులువుగా ట్రాక్ చేయవచ్చు.

► ఐఓఎస్‌ కొత్త అప్‌డేట్‌లో యూజర్స్‌ నోట్స్‌కి ట్యాగ్‌ని యాడ్‌ చేసుకోవచ్చు. దానివల్ల వాటిని కేటగిరీలుగా విభజించటం తేలికవుతుంది. అలానే యూజర్‌ అన్ని కేటగిరీలను ఒకే చోట చూడగలరు. ఇందులోని స్మార్ట్‌ఫోల్డర్స్ ఫీచర్ ట్యాగ్‌ల ఆధారంగా నోట్స్ అన్నింటినీ ఒక చోట చూపిస్తుంది.

► కొత్త అప్‌డేట్ చేసేప్పుడు అపరిమిత క్లౌడ్ స్టోరేజ్‌ని యూజర్స్ యాక్సెస్‌ చేయవచ్చు. మీరు కొత్త డివైజ్‌ కొనుగోలు చేసినా లేదా మీ డేటా బదిలీ చేయాలనుకున్నప్పుడు అపరిమిత క్లౌడ్ స్టోరేజ్‌ని పొందవచ్చు.

► ఐఫోన్ 13 సిరీస్‌, ఐఫోన్ 12 సిరీస్‌, ఐఫోన్ 11 సిరీస్‌, ఐఫోన్ ఎక్స్‌ఎస్‌, ఐఫోన్ ఎక్స్‌ఎస్‌ మ్యాక్స్‌, ఐఫోన్ ఎక్స్‌ఆర్‌, ఐఫోన్ ఎక్స్‌, ఐఫోన్ 8 సిరీస్‌, ఐఫోన్ 7 సిరీస్‌, ఐఫోన్ 6ఎస్‌ సిరీస్‌, ఐఫోన్ ఎస్‌ఈ, ఐపాడ్ టచ్‌ 7వ జనరేషన్‌ డివైజ్‌లను సపోర్ట్ చేస్తుందని యాపిల్ తెలిపింది.

► మ్యూట్ బటన్‌ టచ్‌ చేసిన ప్రతిసారీ మీకు అలర్ట్స్ సౌండ్ వినిపిస్తుంది. దీనివల్ల యూజర్స్ ట్రాకింగ్ పిక్సెల్స్‌ని బ్లాక్ చేయగలరు. యూజర్‌ మార్కెటింగ్‌కి సంబంధించిన ఈ-మెయిల్స్‌ ఓపెన్ చేసినప్పుడు వాటిని ఎప్పుడు ఓపెన్ చేశారు.. ఎంతసేపు ఓపెన్ చేసి ఉంచారనేది మార్కెటింగ్‌ కంపెనీలు పిక్సెల్‌ సాయంతో ట్రాక్ చేస్తాయి. దానివల్ల కొన్నిసార్లు యూజర్‌ డేటా కూడా సదరు కంపెనీలకు చేరిపోయే అవకాశం ఉంది.

► ఐఓఎస్‌ 15లో యాపిల్‌ మ్యాప్స్‌తో యూజర్స్ దారి తెలుసుకోవడంతో పాటు ఒక ప్రదేశానికి బయలుదేరిన, చేరిన సమయాన్ని కూడా తెలుసుకోవచ్చు.

► సుమారు వందకుపైగా కొత్త ఎమోజీలను ఐఓఎస్‌ 15లో పరిచయం చేయనున్నారు. దీని సాయంతో యూజర్స్ మరింత మెరుగ్గా తమ భావాలను ఎమోజీల ద్వారా వ్యక్తపర్చవచ్చు.

► యూజర్స్ ఫొటోలపైన ఉండే టెక్ట్స్‌ని డైరెక్టుగా కాపీ, పేస్ట్, షేర్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ఐఓఎస్‌ 15లో ఓసీఆర్ అనే ఫీచర్ ఇస్తున్నారు.

► కొత్త ఓఎస్‌ అప్‌డేట్‌లో థెఫ్ట్‌ ప్రొటెక్షన్ ఫీచర్‌ ఉంది. ఫోన్‌ పోయినా, దొంగిలించినా, అందులోని సమాచారం తొలగించినా యూజర్‌ ఫోన్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించవచ్చు. అలానే దొంగిలించిన మీ యాపిల్‌ డివైజ్‌ని ఇతరులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తే అందులో ‘ది హలో స్క్రీన్‌’ అనే ఫీచర్‌ సదరు డివైజ్‌ లాక్‌ అయిందని.. అది మరోకరిదనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇవేకాకుండా మరెన్నో ఆసక్తికర అప్‌డేట్‌లు ఐఓఎస్‌ 15లో రానున్నట్లు యాపిల్ తెలిపింది.

► కొత్త ఓఎస్‌లో వస్తోన్న మరో ఫీచర్ ఫోకస్‌. దీని సాయంతో యూజర్స్ తమ నోటిఫికేషన్‌ ప్రాధాన్యతలను కనిపించేలా మార్పులు చేయవచ్చు. అలానే మీ ప్రస్తుత పరిస్థితి ఆధారంగా ఫోన్‌ వైబ్రేట్ కావాలా, సౌండ్ చేయాలా.. వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి:

Google Images: మీకు కావాల్సిన ఫోటోలు గూగుల్‌లో దొరకడం లేదా..? ఇలా చేయండి..!

Google Photos: మీ మొబైల్‌లో స్టోరేజీ నిండిపోయిందా..? పర్వాలేదు ఈ యాప్స్‌లో ట్రై చేయండి..!

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!