Whatsapp: మీ మొబైల్‌లో సేవ్‌కాని నంబర్లకు వాట్సాప్‌ మెసేజ్‌ చేయాలా.. ఇలా చేయండి..!

Subhash Goud

Subhash Goud |

Updated on: Sep 20, 2021 | 5:22 PM

Whatsapp: వాట్సాప్‌.. ఇది వాడని వారుండరు. చిన్నారుల నుంచి పెద్దల వరకు స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ ఉండి తీరాల్సిందే. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే..

Whatsapp: మీ మొబైల్‌లో సేవ్‌కాని నంబర్లకు వాట్సాప్‌ మెసేజ్‌ చేయాలా.. ఇలా చేయండి..!

Follow us on

Whatsapp: వాట్సాప్‌.. ఇది వాడని వారుండరు. చిన్నారుల నుంచి పెద్దల వరకు స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ ఉండి తీరాల్సిందే. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతున్నారు ఎంతో మంది. వాట్సాప్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో ఒకటి. వాట్సాప్‌ లేని స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయంటే చాలా అరుదు అనే చెప్పాలి. స్మార్ట్‌ఫోన్ల రాకతో సంప్రదాయక మొబైల్‌ మెసేజ్‌లకు స్వస్తి చెప్పి పలు యాప్స్‌ను ఉపయోగించి మెసేజ్‌లను చేస్తుంటాం. వాట్సాప్‌ మనందరి నిత్యజీవితాల్లో ఒక భాగమైంది.

వాట్సాప్‌లో ఒకరికి మెసేజ్‌ చేయాలంటే కచ్చితంగా ఆ వ్యక్తి నంబర్‌ ఫోన్‌లో సేవ్‌ అయి ఉండాలి. అప్పుడు మెసేజ్‌ పంపేందుకు వీలవుతుంది. ఇక థర్డ్‌పార్టీ యాప్స్‌ ఉపయోగించి వ్యక్తి నంబర్‌ సేవ్‌ చేసుకోకుండానే వాట్సాప్‌లో మెసేజ్‌ చేయవచ్చు. థర్డ్‌పార్టీ యాప్స్‌నుపయోగించి మెసేజ్‌ చేయడం మన భద్రతకే భంగం వాటిల్లుతుంది. అంతేకాకుండా మనల్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాలను మనలో చాలా మంది ఎదుర్కొన్న వాళ్లమే. కొన్ని సార్లు మనకు చికాకు కూడా తెప్పిస్తోంది. వాట్సాప్‌లో నంబర్‌ లేకుండా మెసేజ్ ఎలా పంపాలి లేదా కాంటాక్ట్ యాడ్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ ఎలా పంపాలో తెలుసుకుందాం.

మీ ఫోన్‌లోని బ్రౌజర్‌ని(క్రోమ్‌ లేదా ఫైర్‌ఫాక్స్‌) ఒపెన్‌ చేయండి. ఇప్పుడు మీరు http://wa.me/xxxxxxxxxx ఈ లింక్‌ని కాపీ చేసి యూఆర్‌ఎల్‌ అడ్రస్‌ బార్‌లోపేస్ట్‌ చేయాలి. ఇక్కడ xxxxxxxxxx స్థానంలో మన దేశం కోడ్‌ 91తో పాటు మీరు మెసేజ్‌ పంపాలనుకున్న మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. ఉదాహరణ: మీ వాట్సాప్‌లో సేవ్‌ చేసుకోలేని ఓ వ్యక్తి నెంబర్‌కు http://wa.me/919911111111 ఎంటర్‌ చేయాలి. ఇక్కడ తొలి రెండు అంకెలు మన దేశ కోడ్‌. తరువాత మెసేజ్‌ పంపాలనుకున్న వ్యక్తి మొబైల్ నంబర్‌. తరువాత మీరు వ్యకత్ఇ ఫోన్‌ నంబర్‌తో గ్రీన్‌ కలర్‌తో మెసేజ్‌ బటన్‌తో ఒక వాట్సాప్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. గ్రీన్‌ కలర్‌ మెసేజ్‌బటన్‌పై క్లిక్‌ చేస్తే మీరు వాట్సాప్‌కు మళ్లించబడతారు. అంతే మీరు వ్యక్తి నెంబర్‌ను సేవ్‌ చేసుకోకుండా ఈ విధంగా మెసేజ్‌ చేయవచ్చును.

ఇవీ కూడా చదవండి:

Apple iOS 15: ఐఫోన్‌ యూజర్లకు అదిరిపోయే శుభవార్త.. ఆ అప్‌డేట్‌ వచ్చేసింది.. ఆసక్తికరమైన ఫీచర్స్‌ ఇవే..!

Michelin Tires: ఈ టైర్లు పంక్చర్‌ కావట.. 3డీ ప్రింటింగ్‌తో తయారు.. పూర్తి వివరాలు..!

Google Images: మీకు కావాల్సిన ఫోటోలు గూగుల్‌లో దొరకడం లేదా..? ఇలా చేయండి..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu