AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iPhone 16 Pro Max: ఏకంగా 24 వేలు తగ్గింపు.. ఆఫర్ ఇక్కడ మాత్రమే!

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్రో మాక్స్ ధరకు భారీ తగ్గింపు లభిస్తోంది. బ్యాంక్ కార్డు డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అద్భుతమైన పనితీరు, ప్రీమియం డిజైన్‌తో ఇది ఇప్పటికీ డబ్బుకు పూర్తి విలువ ఇచ్చే ఫ్లాగ్‌షిప్‌గా నిలుస్తోంది.

iPhone 16 Pro Max: ఏకంగా 24 వేలు తగ్గింపు.. ఆఫర్ ఇక్కడ మాత్రమే!
Iphone 16 Pro Max
Rajashekher G
|

Updated on: Jan 05, 2026 | 5:28 PM

Share

ఐఫోన్ ప్రియులకు ఇది శుభవార్త. మీరు ఐఫోన్ కొనాలనే ఆలోచనలో ఉన్నట్లయితే ఇదే మంచి సమయం. ఆపిల్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 16 ప్రో మాక్స్.. ఇప్పుడు భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్ ఫోన్ ధరను ఏకంగా రూ. 24,000 వరకు తగ్గిస్తోంది. 2024లో లాంఛ్ అయిన ఈ ఫోన్లో పవర్ ఫుల్ A18 ప్రో చిప్‌సెట్, టైటానియం బాడీ, అద్భుతమైన కెమెరా సెటప్ ఉన్నాయి. దీని ధర, డిస్కౌంట్‌, ఇతర వివరాలున పరిశీలిద్దాం.

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఆఫర్ ధర ఇదే

భారతదేశంలో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ 256GB స్టోరేజ్ వేరియంట్ ₹1,34,900 ధరకు లాంఛ్ అయ్యింది. ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు ఈ ఫోన్‌ను ₹1,14,999 కు లిస్ట్ చేస్తోంది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా SBI క్రెడిట్ కార్డులతో మరో ₹4,000 తగ్గింపు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో మీ పాత ఫోన్‌ను మార్పిడి చేసుకోవడం ద్వారా మొత్తంగా రూ. 68,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

ఐఫోన్ 16 ప్రో మాక్స్ ప్రత్యేకతలు

ఐఫోన్ 16 ప్రో మాక్స్ టైటానియం డిజైన్‌ను కలిగి ఉంది. ఇది తేలికా, దృఢంగా ఉంది. ఈ ఫోన్ ఆపిల్ ఇన్-హౌస్ A18 ప్రో చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది 3nm టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాసెసర్ రోజువారీ పనులు, బిగ్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఫోన్ 5 సంవత్సరాల OS అప్‌డేట్‌తో వస్తుంది.

ఐఫోన్ 16 ప్రో మాక్స్ డిస్ప్లే, కెమెరా అద్భుతం ఈ స్మార్ట్‌ఫోన్ 6.9-అంగుళాల LTPO సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. కెమెరా సెటప్‌లో OISతో కూడిన 48MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రా-వైడ్ కెమెరా, 12MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ముందువైపు 12MP కెమెరా ఉంది. ఇది వీడియో కాల్స్, సెల్ఫీల కోసం అద్భుతమైన అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 4685mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. 25W MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

వారు శుభవార్త వింటారు.. 12 రాశుల వారికి బుధవారం దినఫలాలు
వారు శుభవార్త వింటారు.. 12 రాశుల వారికి బుధవారం దినఫలాలు
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?