AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iPhone 15: ఐఫోన్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఐఫోన్‌15పై పదివేలకు పైగా తగ్గింపు..

మీకో శుభవార్త. ఐఫోన్‌15 ఫోన్‌పై అదిరే ఆఫర్‌ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫారం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్‌ 15, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ రూ. 72,999 ప్రారంభ ధరతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. దీనికి అదనంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు మరో రూ. 4,000 తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్ డీల్‌ను అందిస్తుంది. దీంతో దీనిని మీరు ఐఫోన్‌ 15ను రూ.68,999కి కొనుగోలు చేయొచ్చు.

iPhone 15: ఐఫోన్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఐఫోన్‌15పై పదివేలకు పైగా తగ్గింపు..
Iphone 15
Madhu
|

Updated on: Mar 24, 2024 | 8:23 AM

Share

యాపిల్‌ ఐఫోన్‌ చాలా మందికి డ్రీమ్‌ ఫోన్‌. అయితే ధర ఎక్కువగా ఉండటంతో అందరూ దానిని కొనుగోలు చేయలేరు. ఎప్పుడైనా ఆఫర్లు పెడితే కొనొచ్చని చాలా మంది వేచి ఉంటారు. మీరు కూడా అలాంటి వారే అయితే. మీకో శుభవార్త. ఐఫోన్‌15 ఫోన్‌పై అదిరే ఆఫర్‌ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫారం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్‌ 15, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ రూ. 72,999 ప్రారంభ ధరతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. దీనికి అదనంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు మరో రూ. 4,000 తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్ డీల్‌ను అందిస్తుంది. దీంతో దీనిని మీరు ఐఫోన్‌ 15ను రూ.68,999కి కొనుగోలు చేయొచ్చు. వాస్తవానికి ఈ ఐఫోన్‌ 15 అసలు మార్కెట్‌ ధర రూ. 79,900గా ఉంది. అంటేమొత్తం మీద రూ. 10వేలకు పైగానే తగ్గింపు లభిస్తోంది.

ఎక్స్‌చేంజ్‌ ఆఫర్‌..

ఆండ్రాయిడ్‌ ఫోన్ల కంటే ఐఫోన్లు అధిక ఎక్స్‌ చేంజ్‌ విలువను గలిగి ఉంటాయి. ఐఫోన్‌ 15కి కొనుగోలు చేయాలనుకుంటే మీ పాత ఫోన్‌ ఎక్స్‌ చేంజ్‌ చేసుకుంటే భారీగా తగ్గింపు లభించే అవకాశం ఉంటుంది. ఐఫోన్‌ 14కి కూడా ఇది వర్తిస్తుంది. పైన పేర్కొన్న తగ్గింపు ధరతో పాటు మరో రూ. 55,500 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందే వీలుంటుంది. అయితే అది మీ పాత పరికరం వయస్సు, దాని ప్రస్తుత స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఫోన్‌ ఎక్స్‌ చేంజ్‌ సమయంలో సిబ్బంది తనిఖీ చేసి రేటు నిర్ణయిస్తారు.

ఐఫోన్‌ 15 ప్రత్యేకతలు ఇవి..

ఐఫోన్ 15 అనేది పంచ్-హోల్ డిజైన్‌ను స్వీకరించిన తర్వాత ఆపిల్ నుంచి వచ్చిన మొదటి ప్రామాణిక ఫోన్. ఇది కంటెంట్ వినియోగ అనుభవాన్ని మునుపటి కంటే మెరుగ్గా చేస్తుంది. 120హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు లేనప్పటికీ స్క్రోలింగ్ అనుభవం చాలా మృదువైనదిగా ఉంటుంది. డిస్‌ప్లే స్పష్టమైన రంగులను కూడా అందిస్తుంది. ఐఫోన్ 14తో పోలిస్తే, దీనిలో ఒక ముఖ్యమైన అప్‌గ్రేడ్‌ కనిపిస్తుంది. అది కెమెరా. ఐఫోన్‌15లో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుంది. ఐఫోన్ 14 కంటే బ్యాటరీ పరిమాణం నిరాడంబరమైన పెరుగుదలను చూస్తుండగా, ఆపిల్ రెండు రోజుల వినియోగాన్ని వాగ్దానం చేస్తుంది. అయితే వాస్తవ స్థితిలో అంతకన్నా కొద్దిగా త్కువ ఉండొచ్చు.

ఇవి కూడా చదవండి

చార్జర్‌ విడిగా కొనాల్సిందే..

ఒకవేళ మీరు తక్కువ బడ్జెట్లో ఐఫోన్‌ కావాలనుకుంటే ఐఫోన్‌14ని కొనుగోలు చేయొచ్చు. ఇదికూడా మంచి కెమెరా అవుట్‌పుట్‌తో సున్నితమైన పనితీరును అందించగలగుతుంది. మోడల్‌ల మధ్య ఎంపిక వ్యక్తిగత ప్రాధాన్యతలు, బడ్జెట్ పరిమితులపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఏ ఫోన్‌లోనూ ఛార్జర్‌ను కలిగి ఉండదన గమనించాలి. చార్జర్‌ను అదంగా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..