- Telugu News Photo Gallery Technology photos Itel launching new smartwatch itel ICON 3 Features and price details
itel ICON 3: తక్కువ బడ్జెట్‌లో స్టన్నింగ్ ఫీచర్స్.. ఐటెల్ నుంచి అదిరిపోయే స్మార్ట్ వాచ్..
ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ వాచ్‌ల సందడి ఎక్కువైంది. తక్కువ బడ్జెట్‌తో అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌వాచ్‌లను లాంచ్ చేస్తున్నారు. ఇందులోనే భాగంగానే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఐటెల్ మార్కెట్లోకి కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. ఐటెల్ ఐకాన్ 3 పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.?లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Mar 23, 2024 | 8:43 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఐటెల్ భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. ఐటెల్ ఐకాన్ 2కి కొనసాగింపుగా ఐకాన్ 3 పేరుతో వాచ్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌వాచ్‌ను తక్కువ ధరలోనే మంచి ఫీచర్లను తీసుకొచ్చారు. ఈవాచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఐకాన్ 3 స్మార్ట్‌వాచ్ ధరను రూ. 1699గా నిర్ణయించారు. ఈ వాచ్ ప్రీ బుకింగ్స్ మార్చి 24వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఇక ప్రీ ఆర్డర్ చేసుకునే మొదటి 500 కస్టమర్లకు రూ. 100 స్పెషల్ డిస్కౌంట్ లభించనుంది.

ఈ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 2.01 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 2.5 డీ కర్వ్‌డ్ గ్లాస్‌తో ఈ వాచ్‌ను రూపొందించారు. 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందించారు.

ఈ వాచ్‌లో 150కిపైగా వాచ్ ఫేస్‌లను అందించారు. అలాగే ఐకాన్3 వాచ్‌ని డార్క్ క్రోమ్, మిడ్‌నైట్ బ్లూ, షైనీ గోల్డ్ కలర్స్‌లో తీసుకురానున్నారు. బ్లూటూత్ 5.3కి సపోర్ట్ చేసే ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను అందించారు.

ఇక 310 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో తీసుకొచ్చిన ఈ వాచ్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 10 రోజులు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది. ఇందులో ఎస్‌పీఓ2, పీరియడ్ ట్రాకింగ్ వంటి హెల్త్ ఫీచర్లను అందించారు. ఫైండ్ ఫోన్, ఏఐ వాయిస్ అసిస్టెంట్, వెదర్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లను ఇచ్చారు.




