- Telugu News Photo Gallery Technology photos Tecno Launching new smart phone Tecno Pova 6 Pro 5G Check here for features and price details
Tecno Pova 6 Pro 5G: రూ. 15 వేలలో 5జీ ఫోన్.. 108ఎంపీ కెమెరాతో పాటు..
ప్రస్తుతం దేశంలో 5జీ సేవలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. చిన్న చిన్న పట్టణాల్లో కూడా 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తోంది. దీంతో 5జీ స్మార్ట్ ఫోన్‌లు సైతం మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్స్ ఎక్కువగా తీసుకొస్తున్నాయి కంపెనీలు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం టెక్నోపోవా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఇంతకీ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Mar 23, 2024 | 8:06 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం టెక్నో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. టెక్నో పోవా 6 ప్రో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మార్చి 29వ తేదీన ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. టెక్నో పోవా 6 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఈఫోన్‌ను కామెట్ గ్రీన్, మీటరైట్ గ్రే కలర్స్‌లో తీసుకురానున్నారు.

ఇక టెక్నో పోవా 6 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 70 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హెచ్‌ఐఓఎస్ 14 వెర్షన్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది.

ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇవ్వనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. ధర విషయానికొస్తే రూ. 15వేలలో అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.




