AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero Vida Package: కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌.. ఉచితంగా రూ. 27,000 విలువైన ప్రయోజనాలు..

తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా హీరో మోటార్‌కార్ప్‌ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. దీనికి హీరో విడా అడ్వాంటేజ్‌ ప్యాకేజీ అని పేరు పెట్టింది.దీనిలో వినియోగదారులకు హీరో విడా వీ1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ మెయింటెనెన్స్‌తో పాటు సర్వీస్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా పలు ప్రయోజనాలను పొందొచ్చు. ఇప్పుడు ఈ హీరో విడా అడ్వాంటేజ్‌ ప్యాకేజీ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Hero Vida Package: కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌.. ఉచితంగా రూ. 27,000 విలువైన ప్రయోజనాలు..
Hero Vida V1 Pro
Madhu
|

Updated on: Mar 24, 2024 | 8:54 AM

Share

ఆటోమొబైల్‌ మార్కెట్లో ఆఫర్ల జాతర నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఫేమ్‌2 సబ్సిడీలు ముగిసిపోతుండటంతో స్టాక్‌ క్లియర్‌ చేసుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అందుకే మార్చి 31లోపు వీలైనంత ఎక్కువ సేల్స్‌ రాబట్టుకోవాలని చూస్తున్నాయి. అందుకనుగుణంగానే భారీ తగ్గింపులు అందిస్తున్నాయి. దీంతో ఎలక్ట్రిక్‌ స్కూటర్ల మార్కెట్‌కు జోష్‌ వచ్చింది. దీనిని అందిపుచ్చుకోవడంతో పాటు తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా హీరో మోటార్‌కార్ప్‌ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. దీనికి హీరో విడా అడ్వాంటేజ్‌ ప్యాకేజీ అని పేరు పెట్టింది.దీనిలో వినియోగదారులకు హీరో విడా వీ1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ మెయింటెనెన్స్‌తో పాటు సర్వీస్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా పలు ప్రయోజనాలను పొందొచ్చు. ఇప్పుడు ఈ హీరో విడా అడ్వాంటేజ్‌ ప్యాకేజీ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఐదేళ్ల వ్యాలిడిటీతో..

హీరో విడా వీ1 ప్రో ఎలక్ట్రిక స్కూటర్‌ ఉన్న వినియోగదారులు ఈ విడా అడ్వాంటేజ్ ప్యాకేజీని వినియోగించుకోవచ్చు. ఇది 5 సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది. స్కూటర్‌ మెయింటెనెన్స్‌, సర్వీస్‌ వంటివి కలిపి దాదాపు రూ. 27,000 విలువైన ప్రయోజనాలు పొందొచ్చు. ఈ ప్యాకేజీ తీసుకోవాలనుకుంటే ఏప్రిల్ 31, 2024 వరకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది.

సంపూర్ణ సహకారం..

పెట్రోల్‌ ఇంధనంతో నడిచే ద్విచక్ర వాహనాలను వినియోగిస్తున్న వారు ఒకేసారి ఎలక్ట్రిక్‌ వాహనాలకు మారితే వాటి మెయింటెనెన్స్‌, పనితీరు విషయంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాము వినియోగదారులకు సంపూర్ణ సహకారం అందించేందుకు ఈ ప్యాకేజీని తీసుకొచ్చినట్లు హీరో మోటోకార్ప్ ఎమర్జింగ్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ (ఈఎంబీయూ) చీఫ్ బిజినెస్ ఆఫీసర్ స్వదేశ్ శ్రీవాస్తవ అన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారడం అనేది కేవలం వాహనం కొనుగోలు మాత్రమే కాదని తాము అర్థం చేసుకున్నామన్నారు. విడా అడ్వాంటేజ్‌ ప్యాకేజీని ప్రారంభించిన కారణం కూడా ఇదేనన్నారు. ఇది ఎలక్ట్రిక్ వాహన యాజమాన్యాన్ని పునర్నిర్వచించడమే కాకుండా పరిశ్రమలో కస్టమర్-కేంద్రీకృతతకు కొత్త ప్రమాణాన్ని సెట్ చేయడానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు .

ఇవి కూడా చదవండి

విడా ప్యాకేజీలో ప్రయోజనాలు..

ఈ స్కూటర్లోని రెండు బ్యాటరీలపై 5 సంవత్సరాల పాటు ఎక్స్‌ టెండెడ్‌ వారంటీని ఆ ప్యాకేజీ అందిస్తుంది. వేగవంతమైన చార్జింగ్ కోసం దేశ వ్యాప్తంగా 2,000 కంటే ఎక్కువ చార్జింగ్ పాయింట్‌లకు ఉచిత యాక్సెస్‌ను కూడా ఈ ప్యాకేజీ కలిగి ఉంది. విడా వర్క్‌షాప్‌లలో ఉచిత సేవతో పాటు ఉచిత నిర్వహణను అందిస్తుంది. ఒత్తిడి లేని 24*7 రోడ్‌సైడ్ సహాయం కూడా అందుతుంది.

విడా ప్యాకేజీలో ప్రధాన ఫీచర్లు..

ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు మై విడా అనే మొబైల్‌ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజీ ద్వారా వినియోగదారులకు తమ వాహన భద్రత, సౌలభ్యం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాక ఈ ప్యాకేజీ ద్వారా కస్టమర్‌లు తమ వాహనం పనితీరు, భద్రతపై నిజ-సమయ అంతర్దృష్టులు కలిగి ఉండే అవకాశం ఉంది. నియంత్రణ కోసం ఈ యాప్ అనేక కనెక్టివిటీ, భద్రతా ఫీచర్‌లకు యాక్సెస్‌ ఇస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్, పోలీసుల అదుపులో హరీశ్‌రావు!
తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్, పోలీసుల అదుపులో హరీశ్‌రావు!
విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్.. వారందరికి ఫ్రీగా ల్యాప్‌టాప్స్
విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్.. వారందరికి ఫ్రీగా ల్యాప్‌టాప్స్
సవాళ్లు-ప్రతిసవాళ్లు.. తెలంగాణలో హీటెక్కిన పాలిటిక్స్..
సవాళ్లు-ప్రతిసవాళ్లు.. తెలంగాణలో హీటెక్కిన పాలిటిక్స్..
కడుపులో వేడి వల్ల నోటి పూత వేధిస్తోందా? తేనె, మజ్జిగ, పసుపుతో ఇలా
కడుపులో వేడి వల్ల నోటి పూత వేధిస్తోందా? తేనె, మజ్జిగ, పసుపుతో ఇలా
ఐసీసీ చైర్మన్ జై షాకు ధన్యవాదాలు తెలిపిన షారుఖ్
ఐసీసీ చైర్మన్ జై షాకు ధన్యవాదాలు తెలిపిన షారుఖ్
దమ్ముంటే టచ్‌ చేయ్‌రా.. చిరుతకు చింటూ బ్రో సవాల్..
దమ్ముంటే టచ్‌ చేయ్‌రా.. చిరుతకు చింటూ బ్రో సవాల్..
విరిగిపడ్డ కొండచరియలు.. ఏడుగురు కార్మికులు మృతి!
విరిగిపడ్డ కొండచరియలు.. ఏడుగురు కార్మికులు మృతి!
అతిధులకు వానాకాలంలో జొన్న పిండితో చేసి పెడితే ఇమ్యూనిటీ డబుల్
అతిధులకు వానాకాలంలో జొన్న పిండితో చేసి పెడితే ఇమ్యూనిటీ డబుల్
ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన 20 మంది మహిళలు.. ఆ అనుమానంతో ఆరా తీస్తే
ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన 20 మంది మహిళలు.. ఆ అనుమానంతో ఆరా తీస్తే
ముంబైలో ఫ్లాప్.. చెన్నైలో సూపర్ హిట్.. రాత మారిన ప్లేయర్లు..!
ముంబైలో ఫ్లాప్.. చెన్నైలో సూపర్ హిట్.. రాత మారిన ప్లేయర్లు..!