Instagram: మరో అద్భుత ఫీచర్‌ను తీసుకొస్తున్న ఇన్‌స్టాగ్రామ్.. ఇకపై మీరు చూసే ఫీడ్‌ను మీరే కంట్రోల్ చేసుకోవచ్చు.
Instagram Favourites Feature: సోషల్ మీడియా రంగంలో ఫేస్‌బుక్ సంచలనం సృష్టిస్తోన్న సమయంలో వచ్చింది ఇన్‌స్టాగ్రామ్ యాప్. ఫేస్‌బుక్ కంటే ఎక్కువ ఫీచర్లు, ముఖ్యంగా యువతను...
Instagram Favourites Feature: సోషల్ మీడియా రంగంలో ఫేస్‌బుక్ సంచలనం సృష్టిస్తోన్న సమయంలో వచ్చింది ఇన్‌స్టాగ్రామ్ యాప్. ఫేస్‌బుక్ కంటే ఎక్కువ ఫీచర్లు, ముఖ్యంగా యువతను ఆకట్టుకుంటూ దూసుకొచ్చిందీ సోషల్ మీడియా దిగ్గజం. అయితే తదనంతరం ఇన్‌స్టాగ్రామ్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ రోజురోజుకీ యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ పోతోందీ యాప్. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. సాధారణంగా మన న్యూస్ ఫీడ్‌లో ఏం చూడాలనుకునేది ఇన్‌స్టాగ్రామ్ చేతిలోనే ఉంటుంది. ఏ పోస్టులకు ఎక్కువగా లైక్‌లు, కామెంట్లు వస్తాయో అవే న్యూస్ ఫీడ్‌లో మనకు కనిపిస్తాయి. అయితే ఇందులో మనకు అవసరంలేనివి. మన వారికి సంబంధించనివే ఎక్కువగా ఉంటాయి.
అలా కాకుండా న్యూస్ ఫీడ్‌లో కనిపించే ఫొటోలు, వీడియోలు మనకు నచ్చిన వారివే వచ్చేవే చేసుకునేలా ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతోంది. ఇందుకోసం ఇన్‌స్టాగ్రామ్ ఫేవరెట్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. దీనిద్వారా యూజర్లు తమ ఫీడ్‌లో ఏయే అకౌంట్లకు సంబంధించిన పోస్టులను కనిపించాలో సెలక్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
ఇక ఫేస్‌బుక్ లాగానే ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పోస్టులు కనిపించటంపై లైక్స్, సేవ్, కామెంట్స్ వంటి రకరకాల అంశాలు ప్రభావితం చేస్తాయి. ఈ కారణంగా కొన్ని పోస్టులు కిందికి వెళ్లిపోతాయి. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ ఫీచర్ అందరు యూజర్లకు అందుబాటులోకి రానుంది.
CBSE CTET 2021: CTET పరీక్ష తేదీలు విడుదల.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం..
Minister KTR: విశ్వరూపం చూపించిన మంత్రి కేటీఆర్.. డ్రగ్స్, పాలిటిక్స్‌పై సంచలన కామెంట్స్..